హీరోయిన్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారా.. వరుడు అతనేనా..?

స్టార్ హీరోయిన్ అనుష్క చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు.అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా అనుష్క మాత్రం పెళ్లి చేసుకోలేదు.

 Heroina Anushka  Shetty To Marry Business Man Very Soon, Business Man, Heroine A-TeluguStop.com

ఇంటర్వ్యూలలో పెళ్లికి సంబంధించి ప్రశ్నలు ఎదురైనా ఆ ప్రశ్నలను అనుష్క దాటవేస్తూ వచ్చారు.అయితే అనుష్క పెళ్లికి సంబంధించి ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి.

దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను అనుష్క వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.అయితే ఈ మేరకు అధికారక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది.

గతంలో కూడా అనుష్క పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఆ వార్తలు నిజం కాలేదు.అనుష్క పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆమె కంటే చిన్నవాడని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు అనుష్క నటించే సినిమాల సంఖ్యను భారీగా తగ్గించారు.

గతేడాది అనుష్క నటించి విడుదలైన నిశ్శబ్దం సినిమా హిట్ కాలేదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం అనుష్క తెలుగులో ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు.

మరి అనుష్క పెళ్లి వార్తల గురించి నిజానిజాలు తెలియాలంటే అనుష్క చెప్పేవరకు ఆగాల్సిందే.

Telugu Heorineanushka-Movie

అనుష్క పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల పట్ల ఆమె ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.అనుష్క త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క నటించిన ఒక సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు.వరుస విజయాలతో జోరుమీదున్న నవీన్ పోలిశెట్టి అనుష్క కాంబినేషన్ లో కొత్తతరహా కథాంశంతో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube