హీరోల మీటింగ్‌.. ఫలితం జీరో!

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా ఉద్యమంను ప్రారంభించిన శ్రీరెడ్డి మెల్ల మెల్లగా తన ఉద్యమంను తీవ్రతరం చేసింది.శేఖర్‌ కమ్ముల, నాని, కోన వెంకట్‌, దగ్గుబాటి అభిరామ్‌ ఇలా పలువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

 Heroes Meeting In Annapurna Studio-TeluguStop.com

ఆ తర్వాత రామ్‌ గోపాల్‌ వర్మ సూచన మేరకు పవన్‌ కళ్యాణ్‌ను రాయడానికి వీలు లేని భాషలో తిట్టడం జరిగింది.శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తాను ఉన్నాను అంటూ వర్మ బాహాటంగా ప్రకటించడంతో పవన్‌ కళ్యాణ్‌ రెచ్చి పోయాడు.

తనను, తన తల్లిని దూషించిన వ్యక్తిపై, ఆ వెనుక ఉన్న వ్యక్తిపై కఠిన చర్యు తీసుకోవాల్సిందే అంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌లో హంగామా సృష్టించిన విషయం తెల్సిందే.

దాదాపు అయిదు గంటల పాటు పవన్‌ కళ్యాణ్‌ ఛాంబర్‌లో ఉండి నిరసన తెలియజేశాడు.దాంతో ఆ తర్వాత రోజే సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాల వారు కూడా అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయిన విషయం తెల్సిందే.ఆ భేటీలో ఒక కమిటీ వేయడం జరిగింది.

ఆ తర్వాత చిరంజీవి పిలుపు మేరకు అదే అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యారు.ఆ భేటీ జరిగింది వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు భేటీకి సంబంధించిన వివరాలు వెళ్లడి కాలేదు.

అసు ఆ భేటీ ఎందుకు జరిగింది, అక్కడ ఏం చర్చించారు అనే విషయాు వెళ్లడవ్వలేదు.

హీరోల భేటీ వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు చేకూరిన లాభం ఏమీ లేదని, అసు వారి భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని, మెగా ఫ్యామిలీ వారు కోరుతున్నట్లుగా మీడియా ఛానల్స్‌ను అదుపులో ఉంచాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.

హీరోలు అంతా కూడా ఏక తాటిపై నిలబడటం లేదని భేటీతో అర్థం అయ్యింది.అంతా సజావుగా సాగితే మరోసారి హీరోలు భేటీ అవ్వాల్సి ఉంది.

గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ విషయాల గురించి చర్చించాలని భావించారు.

ఇప్పటి వరకు హీరోల రెండవ భేటీ గురించిన చర్చ కనిపించడం లేదు.

అసలు హీరోలు మరోసారి కలుస్తారన్న నమ్మకం కూడా కొందరిలో లేదు.స్టార్‌ హీరోలు, చిన్న హీరోలు అంతా కూడా భేటీ అవ్వడం ఒక శుభపరిణామంగా అంతా భావించారు.

కాని ఆ భేటీ వల్ల ఫలితం జీరో అని తెలిసి నివ్వెర పోతున్నారు.ఇప్పటికైనా మరోసారి హీరోలు భేటీ అయ్యి ఫిల్మ్‌ ఛాంబర్‌కు దిశా నిర్థేశం చేయాలని, సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యలపై పోరాడాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube