కేజిఎఫ్ సినిమా ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టిన హీరో యశ్!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి  బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

 Hero Yash Put A Pullstop To The Six Year Journey-of Kgf Movie Yash, Kollywood, K-TeluguStop.com

ఇలా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇకపోతే కేజిఎఫ్ సినిమా ప్రారంభించి ఇప్పటికి ఆరు సంవత్సరాలు కావచ్చింది.

ఈ క్రమంలోనే కేజిఎఫ్ చాప్టర్ 2 ను ఏప్రిల్ 14వ తేదీ ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులను జరుపుకుంటోంది.

ఆరు సంవత్సరాల క్రితం ఈ సినిమా కోసం కమిటైన హీరో యశ్ తాజాగా ఆరేళ్ల కేజిఎఫ్ జర్నీకి పులిస్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.తాజాగా ఈయన ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఆయన పనులన్ని పూర్తి అయినట్లు సమాచారం.గత ఆరు సంవత్సరాల నుంచి హీరో ఒకే విధమైన బాడీ లుక్ మెయిన్ టైన్ చేస్తూ ఈ సినిమా కోసం ఎంతో కష్ట పడ్డారు అని చెప్పవచ్చు.ఇలా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకొని ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం కానుంది.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube