మైత్రీ నిర్మాతలతో సినిమాకి సంతకం చేసిన రాకింగ్ స్టార్ యష్

కేజీఎఫ్ సిరీస్ తో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం ఇతను కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

 Hero Yash Movie Signed With Mythri Movie Makers-TeluguStop.com

కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది.

ఇది థియేటర్ లోకి వస్తే యష్ ఇమేజ్ మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కన్నడంలోనే మరో యువ దర్శకుడు నార్తన్ తో యష్ మూవీ చేయనున్నాడు.

 Hero Yash Movie Signed With Mythri Movie Makers-మైత్రీ నిర్మాతలతో సినిమాకి సంతకం చేసిన రాకింగ్ స్టార్ యష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే దీని తర్వాత టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో యష్ జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మైత్రీ నిర్మాతలు సౌత్ లో క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేయడానికి వరుసగా లైన్ లో పెడుతుంది.

విజయ్ సేతుపతితో సౌత్ బాషలలో ఒక సినిమా ప్లాన్ చేస్తుంది.

ఇళయదళపతి విజయ్ డేట్స్ కోసం ట్రై చేసిన ముందుగా అతనితో సినిమా చేసే అవకాశం దిల్ రాజుకి వచ్చింది.ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్ తో మంచి జోరు మీద ఉన్న యష్ తో సినిమా చేయడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు.

అయితే అతను మాత్రం రీసెంట్ గా మైత్రీ నిర్మాతలకి ఒకే చెప్పినట్లు సమాచారం.అయితే ఈ మూవీ దర్శకుడు ఎవరనే విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులలో ఒకరితో ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే పాన్ ఇండియా రేంజ్ లో చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

#HeroYash #Hero Yash #MythriMovie #Prashanth Neel #KGFChapter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు