ఆర్ఆర్ఆర్ తో మేము పోటీ పడటం లేదు... క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ హీరో  

Hero Yash Clarity On No Clash Between Rrr And Kgf2 - Telugu Bollywood, Hero Yash, Kannada Cinema, No Clash Between Rrr And Kgf2, Tollywood

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.

Hero Yash Clarity On No Clash Between Rrr And Kgf2

ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.అయితే ఆర్ఆర్ఆర్ తో పాటు సౌత్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ సీక్వెల్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ కూడా వచ్చే ఏడాది ఆరంభంలోకి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ నేపధ్యంలో రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తో మేము పోటీ పడటం లేదు… క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ హీరో-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో వాటిపై కేజీఎఫ్ హీరో యష్ క్లారిటీ ఇచ్చారు.

సౌత్ల లో పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోవని స్పష్టం చేశారు.

అలాంటి పిచ్చిపని తాము చేయబోమని, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు.ఏప్రిల్‌లో వారి సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో ముందుగానే తముకు ఆ విషయం చెప్పారని, అదే సమయంలో మీరు కేజీఎఫ్‌ 2ను రిలీజ్‌ చేయదల్చుకుంటే రిలీజ్‌ షెడ్యూల్‌ మార్చుకోవాలని సూచించారని అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిన క్రమంలో ఆ విషయం వారు తమకు తెలిపారని, తమ రిలీజ్‌ ప్రణాళికలను తెలుసుకున్నారని వెల్లడించారు.రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఒకేసారి తలపడవని స్పష్టం చేసేశారు.

ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం మీడియాకి అలవాటని చెప్పేసాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Yash Clarity On No Clash Between Rrr And Kgf2 Related Telugu News,Photos/Pics,Images..

footer-test