విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్ తెలుసా.. ఆ పేరు అంటే ప్రేమ అంటూ?

విశ్వక్ సేన్( Vishwak sen ) హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు.

 Hero Vishwak Sen Shocking Sentiment Details Here Goes Viral In Social Media , Da-TeluguStop.com

దాస్ కా ధమ్కీ సినిమా ఆ లోటు తీరుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.విశ్వక్ సేన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని సమాచారం అందుతోంది.

అయితే విశ్వక్ సేన్ తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాల పేర్ల విషయంలో దాస్ అని ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.ఫలక్ నుమా దాస్ గురించి ఇప్పటికే ప్రేక్షకులకు తెలియగా ధమ్కీ సినిమా( Das Ka Dhamki )లో కృష్ణదాస్ అనే పాత్రలో కనిపించనున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కూడా దాస్ అనే పేరు ఉండే ఛాన్స్ అయితే ఉందని ఆ పేరు అంటే నాకు ఎంతో ఇష్టమని విశ్వక్ సేన్ కామెంట్లు చేయడం గమనార్హం.

ఫలక్ నుమా దాస్( Falaknuma Das ) సక్సెస్ సాధించగా దాస్ కా ధమ్కీ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా విశ్వక్ సేన్ నైజాంలో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.దాస్ అనే పేరుపై ప్రేమ ఉందని విశ్వక్ సేన్ చెప్పకనే చెప్పేశారు.

విశక్ సేన్ కు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.నివేదా పేతురాజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ రేంజ్ లో ఉండగా ఆమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.విశ్వక్ సేన్ పారితోషికం ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube