కరోనా నుంచి కోలుకున్న హీరో విశాల్

కరోనా వైరస్ దేశంలో రోజురోజుకి విస్తరిస్తూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఇల్లు వదిలి బయటకి వెళ్లాలంటేనే వణుకుపుడుతుంది.

 Hero Vishal Recovered From Corona, Kollywood, Corona Effect, Covid-19-TeluguStop.com

ఎక్కడ, ఎవరి వలన కరోనా మన ఒంట్లోకి ప్రవేశిస్తుందో, అక్కడి నుంచి మన ఇంట్లోకి వస్తుందో అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది.ఇక సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు.

అయితే పూర్తిస్థాయిలో వైద్యం లేకపోయినా స్వీయ రక్షణతో చాలా మంది ఈ వైరస్ బారిన పడిన మరల తమని తాము రక్షించుకుంటున్నారు.కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, అతని తండ్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని విశాల్ స్వయగా ధ్రువీకరించారు.త‌న మేనేజ‌ర్‌కి కూడా క‌రోనా పాజిటీవ్ అని తేలింది.

దీంతో వారం రోజులుగా విశాల్ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటూ కోలుకున్నాడు.ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా విశాల్ ప్ర‌క‌టించాడు.భ‌యం లేకుండా ఉండ‌డ‌మే కోవిడ్‌కి అస‌లైన మందు.అంతా ధైర్యంగా ఉండండి.

ఏమీ కాదు.కోవిడ్ వ‌చ్చిన వెంట‌నే మేం ఆసుప‌త్రుల వెంట ప‌రుగెట్ట‌లేదు.

ఇంట్లోనే ఉంటూ హోమియోప‌తి, ఆయుర్వేద మందులు వాడాం.వాటితో త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం దొరికింది.

మా డాక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స‌ల‌హాలూ, సూచ‌న‌లు పాటించాం.సినిమాల గురించో, ఇత‌ర విష‌యాల గురించో చాలా వీడియోలు పెట్టి ఉంటాను.

కానీ ఈ సమ‌యంలో ఇలాంటి ఓ వీడియో పోస్ట్ చేయ‌డం నా ధ‌ర్మం.అలాగ‌ని నేను హోమియో, ఆయుర్వేద మందుల్ని ప్ర‌చారం చేయ‌డం లేదు.

ఇది నా బాధ్య‌త‌గా భావిస్తున్నా అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.ఇక కరోనా నుంచి బయట పడటానికి తాను ఎలాంటి మందులు వాడాడో ఓ లిస్టుని విశాల్ ట్విట్ట‌ర్ లో పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube