రాజకీయ 'చదరంగం'లో హీరో విశాల్ ...?

సినీ హీరో విశాల్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.కొద్ది రోజులుగా.

 Hero Vishal In Political Game-TeluguStop.com

తమిళ నిర్మాతల మండలి నడిగర్ సంఘంతో ఆయనకు విబేధాలు వచ్చాయి.ఆ వివాదం కాస్తా ముదిరి విశాల్ అరెస్ట్ వరకూ దారితీసింది.

ఇప్పుడు విశాల్ తమిళ చిత్ర సీమలో రెబల్ స్టార్ గా మారిపోయాడు.ఆయనపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది.

ఒకప్పుడు ఆయనకు జై కొట్టినవారు ఇప్పుడు మద్దతు చెప్పేందుకు వెనకాడుతున్నారు.అదీ కాకుండా… 2017లో విశాల్‌ టీఎన్‌ఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆర్కే సురేశ్‌, ఉదయ అనే ఇద్దరు నిర్మాతలు విశాల్ వైపు నిలబడ్డారు.కానీ….ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఇప్పుడు వీరే విశాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.ముందు నుంచీ విశాల్ పై కొంత మంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు.

దీనికి రాజకీయ కక్షలు… కూడా కారణం అయ్యాయి.

విశాల్ కొంతమంది నాయకులకు టార్గెట్ గా మారడంతో….వారు సరైన కారణం కోసం ఎదురు చూస్తున్నారు.అలా చూస్తుండగానే….

ఇప్పుడు వారికి ఒకేసారి 9 సినిమాల విడుదల అవ్వడం కూడా బాగా కలిసి వచ్చింది.అసలు సినిమాల విడుదలను క్రమబద్ధీకరించడం కోసం టీఎన్‌ఎఫ్‌పీసీ ఓ కమిటీని వేసింది.

ఈ కమిటీ సూచనల ప్రకారమే.సినిమాలు విడుదలవుతున్నాయి.

అయితే ఈ కమిటీ పక్షపాతంగా వ్యవహరిస్తోందనేది కొందరు నిర్మాతల ఆరోపిస్తున్నారు.ఒకేసారి తొమ్మిది సినిమాల విడుదలకు నిర్మాతల మండలి ఓకే చెప్పడం ఏమిటన్నది నిర్మాతల ప్రధాన అభ్యంతరం.

దీన్ని పెద్ద సాకుగా చూపించి విశాల్ ను ఆ పదవి నుంచి దించాలని చూస్తున్నారు.అంతే కాకుండా….

ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని సైతం రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించేలా రాజకీయ నాయకులతో కలిసి కొంతమంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక విశాల్ సంగతి చూస్తే….ఆయన నిర్మాతల మండలి అధ్యక్షునిగా కొన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆర్థికంగా… దెబ్బతిన్న నిర్మాతలకు సాయం చేసేందుకు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.ఈ విధంగానే….ఇళయరాజాతో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు.ఆ ఈవెంట్ జరగకుండానే.ఈ వివాదాన్ని రేపినట్టుగా అనుమానం కలుగుతోంది.అసలు విశాల్ మీద ఈ స్థాయిలో రచ్చ జరగడానికి కారణం ఆయన తమిళ రాజకీయాల్లో దూరడమే అని తెలుస్తోంది.ఎందుకంటే….ఆర్కేనగర్ ఉపఎన్నిక సమయంలో.విశాల్ దినకరన్‌ కు మద్దతుగా నిలిచారు.దినకరన్‌ను పోటీకి అనర్హుడ్ని చేస్తే.తాను పోటీకి దిగాలనుకున్నారు.

నామినేషన్ కూడా వేశారు.ఇప్పుడు అదే ఆయనకు శాపంగా మారినట్టు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ రాజకీయ ఉచ్చు నుంచి విశాల్ బయటపడతాడో ….బలవుతాడో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube