హైద్రాబాద్‌ అల్లుడు అవనున్న విశాల్‌... త్వరలోనే నిశ్చితార్ధం

కోళీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న హీరో విశాల్‌ పెళ్లి గురించి చాలాకాలంగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెల్సిందే.విశాల్‌ హీరోయిన్‌ వరలక్ష్మితో గతకొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఇద్దరు సహజీవనం చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

 Hero Vishal Going To Be A Hyderabad Son In Law-TeluguStop.com

ప్రేమ విషయమై విశాల్‌, వరలక్ష్మిలపై అనేక రకాల పుకార్లు హల్‌ చల్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు కూడా గప్‌చుప్‌న ఉండడంతో పుకార్లకు తెర పడకుండా తరుచుగా మీడియాలో వైరల్‌ అవుతూ వస్తున్నాయి.

వరలక్ష్మి, విశాల్‌ ల ప్రేమ పుకార్లకు త్వరలోనే తెర పడనుంది.విశాల్‌కు తాజాగా హైద్రాబాద్‌ అమ్మాయితో పెళ్లి ఫిక్సయినట్టు సమాచారం అందుతోంది.హైద్రాబాద్‌ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి విశాల్‌ ఒకే చెప్పాడట.

త్వరలోనే నిశ్చితార్థం కూడా జరుగనుంది అని టాక్‌ వినిపిస్తోంది.వరలక్ష్మితో చాలా కాలం ప్రేమలో ఉన్న విశాల్‌ కచ్చితంగా వరలక్ష్మినే పెళ్లి చేసుకుంటాడు అని తమిళ మీడియాలో అనేక కథనాలు ప్రచురితం అయ్యాయి.

కానీ తాజా పరిణామాలతో ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని, విశాల్‌ హైద్రాబాద్‌ అల్లుడు అవబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

అమ్మాయి గురించి ఇంకా ఏ విషయాలు బయటకు రాలేదు కానీ, విశాల్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది మాత్రం హైద్రాబాద్‌ అని, హైద్రాబాద్‌లో వెల్‌ సెటిల్‌ అయిన కుటుంబం అని తెలుస్తోంది.దాంతో విశాల్‌ పెళ్లి చేసుకోబోయే ఆ హైద్రాబాదీ అమ్మాయి ఎవరు అనేది ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube