పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్.. సమయం చూసుకొని

గత ఏడాది చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి పీటలెక్కారు.భర్తగా కొత్త జీవితాలని స్టార్ట్ చేశారు.

 Hero Vishal Gives Clarity On Marriage, Tollywood, Kollywood, Chakra Movie, South-TeluguStop.com

రానా, నితిన్, నిఖిల్, నిహారికా పెళ్లి చేసుకున్నారు.ఇక గత ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన విశాల్ వెనక్కి తగ్గాడు.

గత ఏడాది ముందు హైదరాబాద్ అమ్మాయి అనీషారెడ్డితో విశాల్ ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది.ఈ నేపధ్యంలోనే ఇద్దరూ నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యే సమయంలో ఎందుకనో ఎవరి దారి వారు చూసుకున్నారు.దీంతో మళ్ళీ విశాల్ పెళ్లి కథ మొదటికి వచ్చింది.43 ఏళ్ళు వచ్చేసిన విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అంటూ కోలీవుడ్, టాలీవుడ్ లో మీడియా హడావిడి చేస్తుంది.తాజాగా విశాల్ చక్ర సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉన్నాడు.

ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కూడా విశాల్ క్లారిటీ ఇచ్చేశాడు.

తన జీవితంలో ఏది అనుకొని జరగలేదని చెప్పుకొచ్చాడు.

హీరోని అవుతానని అస్సలు ఊహించలేదు.అయినా హీరో అయ్యాను.

అలాగే తప్పనిసరి పరిస్థితిలో నిర్మాతగా కూడా మారాల్సి వచ్చింది.ఇప్పుడు దర్శకుడుగా మారిపోయాను.

ఏది మనం అనుకుంటే జరగదు.అనుకోకుండా అన్ని జరుగుతాయి.

అలాగే నా పెళ్లి కూడా.ఈ ఏడాదిలోనే నా పెళ్లి జరిగిపోయే అవకాశం ఉంది.

దానిని కూడా మనం ఆపలేం.సమయం వచ్చినప్పుడు కచ్చితంగా జరిగిపోతుంది అంటూ ఓ వేదాంత ధోరణిలో మాట్లాడిన కూడా ఈ ఏడాదిలో విశాల్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు అతని మాటల బట్టి అర్ధమవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube