శనివారం హైదరాబాద్ లో విశాల్ నిశ్చితార్ధం!  

హైదరాబాద్ లో శనివారం హీరో విశాల్ నిశ్చితార్ధం. .

  • సౌత్ హీరో విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం ఇప్పటికే దృవీకరించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే తన స్నేహితుడు ఆర్య హైదరాబాద్ లో తన ప్రేయసి సయేషాని పెళ్లి చేసుకున్నాడు. ఇక విశాల్ కూడా తన పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం హైదరాబాద్లో విశాల్ నిశ్చితార్దం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కుమార్తె, నటి అనిశా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

  • ఆ మధ్య కాలంలో హీరోయిన్ వరలక్ష్మిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడని వచ్చిన వార్తలకి విశాల్ ఎంగేజ్మెంట్ తో ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇక ఈ నిశ్చితార్ధ వేడుకకి టాలీవుడ్ కి చెందిన తన సన్నిహితులని విశాల్ ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ నిశ్చితార్ధ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.