దుబాయ్ లో హీరో విక్రమ్ కొడుకు ఆ హీరోయిన్ తో రొమాన్స్.. వైరల్ ఫోటోలు!

తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు విక్రమ్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విక్రమ్ తన వారసుడిగా తన కొడుకు ధృవ్‌ విక్రమ్‌ ను ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.

 Hero Vikram Son Romances With Heroine In Dubai Viral Photos Details,  Vikram, So-TeluguStop.com

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఇదే చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తూ ఈ సినిమా ద్వారా విక్రమ్ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా  బ్రిటిష్‌కు(భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ కుటుంబంలో జన్మించింది) చెందిన నటి బనిత సంధు హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ధృవ్‌ విక్రమ్‌ హీరోయిన్ బనిత సందుతో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే వీరి గురించి ఈ విధంగా వార్తలు వస్తున్నప్పటికీ ఈమె ఏమాత్రం స్పందించలేదు.

తాజాగా ఈ జంట న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది వీరిద్దరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

Telugu Arjun Reddy, Dhruv Vikram, Dubai, Vikram, Banita Sandhu, Romance, Tamil-M

కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం దుబాయ్ వెళ్లిన ఈ జంట అక్కడ హోటల్ రూమ్ లో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డర్కెస్ట్‌ హోల్డ్‌ ఆన్‌ వీ ఆర్‌ గోయింగ్‌ హోం’ అనే ఇంగ్లీష్‌ పాటను జత చేశాడు.అదేవిధంగా బనిత హోటల్ రూమ్ బాల్కనీలో నిలబడి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఆమెకు న్యూ ఇయర్ తెలిపారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు వీరి గురించి వస్తున్న వార్తలు నిజమేనంటూ న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట ఆ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తానికి వీరికి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube