మారిపోయిన విజయ్ సేతుపతి.. వాళ్లకు నో చెబుతున్నాడట..?

గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగుతోంది.96 సినిమా తమిళ్ వెర్షన్ ను చూసిన చాలామంది ఫ్యాన్స్ ఆ సినిమాలో విజయ్ నటనకు ఫిదా అయిపోయారు.ఈ ఏడాది విడుదలైన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి తన నటనతో విజయ్ నే డామినేట్ చేశాడని కామెంట్లు వినిపించగా ఉప్పెన సినిమాకు తెలుగులో ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడానికి విజయ్ సేతుపతి కారణమని చెప్పవచ్చు.

 Hero Vijay Setupathi Says No To New Movie Offers-TeluguStop.com

విజయ్ సేతుపతికి రోజురోజుకు క్రేజ్ పెరుగుతుండటంతో దర్శకనిర్మాతలు విజయ్ సేతుపతి తమ భవిష్యత్తు సినిమాల్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే విజయ్ సేతుపతి మాత్రం కొత్త ఆఫర్లను అంగీకరించడం లేదని కొత్తగా వస్తున్న ఆఫర్లలో చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.2023 వరకు విజయ్ సేతుపతి వరుస ఆఫర్లతో ఇప్పటికే బిజీగా ఉన్నారట.

2020 సంవత్సరంలోనే భవిష్యత్తులో తెరకెక్కే చాలా సినిమాలకు విజయ్ సేతుపతి డేట్లు ఇచ్చేశాడని భారీ ఆఫర్ అయితే తప్ప ఇప్పట్లో విజయ్ సేతుపతి కొత్త సినిమా ఆఫర్లకు అంగీకరించే పరిస్థితులు అయితే లేవని తెలుస్తోంది.ఇప్పటికే చాలా సినిమాలకు డేట్లు కేటాయించడంతో మంచి పాత్రలు వచ్చినా విజయ్ సేతుపతి నో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

 Hero Vijay Setupathi Says No To New Movie Offers-మారిపోయిన విజయ్ సేతుపతి.. వాళ్లకు నో చెబుతున్నాడట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం విజయ్ సేతుపతికి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం విజయ్ సేతుపతి తీసుకుంటున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే రెట్టింపు రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నా విజయ్ సేతుపతి మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పిస్తే ప్రస్తుతం విజయ్ సేతుపతి సైతం అదే స్థాయిలో తన నటన ద్వారా మెప్పిస్తున్నారు.భవిష్యత్తులో విజయ్ సేతుపతి స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

#VijaySethupathi #VijaySethupathi #Villain Roles #VijaySethupathi #Says No

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు