హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం! ఎదురుచూస్తున్న అభిమానులు

తమిళ స్టార్ హీరో విజయ్ మీద ఈ మధ్య కాలంలో రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయనే మాట తమిళనాట ఎక్కువగా వినిపిస్తుంది.బడుగు, బలహీన వర్గాలు, బీసీలు ఎక్కువగా ఉండే తమిళనాడులో ప్రస్తుతం కొంత రాజకీయ శూన్యత ఉందని చెప్పాలి.

 Hero Vijay Plan To Political Entry-TeluguStop.com

అయితే దానికి ఆవకాశంగా మలుచుకోవడానికి ఇప్పటికే కమల్ హసన్ రాజకీయ పార్టీ పెట్టి ముందుకి వెళ్తున్నాడు.అయితే అతనికి అనుకున్న స్థాయిలో ప్రజాదారణ లభించడం లేదు.

ఇక రజినీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెడతాడా, బీజేపీతో కలిసి వెళ్తాడా అనేది అర్ధం కాని విధంగా ఉంది.మరో వైపు అన్నాడిఎంకే పార్టీలో ఆధిపత్య పోరు ఉంది.

ఆ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చే అవకాశం అయితే అసలు లేదు.

ఇలాంటి సమయంలో స్టార్ హీరోగా, రజిని తర్వాత ఆస్థాయిలో అభిమానులని కలిగి ఉన్న వాడుగా, బీజేపీ వ్యతిరేకిగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మంచి చరిష్మా ఉన్నవాడు కావడంతో అలాగే తమిళనాడులో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకి నాయకత్వం వహించే వ్యక్తిగా విజయ్ అయితే చాలా బలమైన ప్రభావం చూపిస్తాడని భావిస్తున్నారు.అతని రాక కోసం అభిమానులతో పాటు, కొంత మంది సామాజిక వర్గాలకి చెందిన నాయకులు కూడా విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా బీజేపీ పార్టీ తనపై జరిపిన ఎన్ కమ్ టాక్స్ రైడ్స్ ని రాజకీయ వేదికకి అవకాశంగా మార్చుకోవాలని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.మరి దీనిపై విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube