రానా ఎలాంటి నటుడో అర్థం కావడం లేదు అంటున్న స్టార్ హీరో...

తెలుగులో హీరో, విలన్, గెస్ట్, ఇలా ఏదైనా సరే తనదైన శైలిలో ఆకట్టుకునే హీరో రానా దగ్గుబాటి గురించి తెలియని వారుండరు.రానా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో నటిసస్తూ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

 Hero Victory Venkatesh Sensational Comments On Rana-TeluguStop.com

అయితే తాజాగా దగ్గుబాటి రానా సినీ ఇండస్ట్రీకి పరిచయమై పది సంవత్సరాలు కావొస్తుడంతో  తన సినీ ప్రయాణానికి సంబంధించినటువంటి వీడియో ని సురేష్ ప్రొడక్షన్ నిర్వాహకులు చిత్రీకరించారు.

ఈ వీడియో లో భాగంగా టాలీవుడ్ సార్ హీరో విక్టరీ వెంకటేష్ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

ఇందులో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ అసలు రానా దగ్గుబాటి  ఎలాంటి నటుడో ఇప్పటికీ తనకి అర్థం కావడం లేదని అన్నారు.ఇందుకు  వివరణ ఇస్తూ ఒకసారి హీరో పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు.

మరోసారి విలన్ పాత్రలో భయపెడతాడు.అంతేగాక గెస్ట్ అప్పియరెన్స్ పాత్రల్లో కూడా నటిస్తాడని అందువల్ల తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు.

కానీ కొడుకు పై ఒక వైపు ప్రశంసలు కూడా కురిపించా డు.ఏదేమైనప్పటికీ రానా దగ్గుబాటి మాత్రం మంచి నటుడని బాబాయ్ కితాబు ఇచ్చాడు.

Telugu Tollywood Rana, Venkatesh-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నటువంటి “నారప్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించిన అసురన్  చిత్రానికి రీమేక్ గా ఉంది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు కూడా పూర్తయ్యాయి.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube