అప్పట్లో సౌందర్య కాళ్లు పట్టుకున్న హీరో వెంకటేష్.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.సౌందర్య, వెంకటేష్ కాంబోలో వచ్చిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

 Hero Venkatesh Soundarya Pavitra Bandham Narappa-TeluguStop.com

హీరో వెంకటేష్ నటించిన నారప్ప అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వెంకటేష్ ఈ సినిమా గురించి ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.చంటి సినిమా చేసే సమయంలో ఆ సినిమా చేయవద్దని చాలామంది సూచించారని వెంకటేష్ అన్నారు.

పవిత్ర బంధం సినిమాలో సౌందర్య కాళ్లను పట్టుకున్న పోస్టర్ రిలీజైన సమయంలో ఇలాంటి సినిమాలు చూడరంటూ కామెంట్లు చేశారని వెంకటేష్ చెప్పుకొచ్చారు.స్క్రిప్ట్ ను నమ్మి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు కొత్త కథలు తెరపై చూసే అవకాశం అయితే కలుగుతుందని వెంకటేష్ చెప్పుకొచ్చారు.క్యారెక్టర్ ను బట్టి మనం మారాలని హీరో ఎలివేషన్లు ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని అనుకోవడం కరెక్ట్ కాదని వెంకటేష్ అన్నారు.

 Hero Venkatesh Soundarya Pavitra Bandham Narappa-అప్పట్లో సౌందర్య కాళ్లు పట్టుకున్న హీరో వెంకటేష్.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నారప్ప లాంటి సినిమాలు అరుదుగా వస్తాయని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

నారప్పలో చెప్పులు విప్పి కాళ్ల మీద పడే సీన్ ఒకటి ఉంటుంది.ఇలాంటి సన్నివేశాలు హీరో చేస్తే బాగుంటుందా.? అని మనం ఆలోచిస్తామని వెంకటేష్ వెల్లడించారు.కంటెంట్ బాగుండి సీన్ డిమాండ్ చేస్తే అలాంటి సినిమాలు చేయడం తప్పు లేదని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

ఇలాంటి సినిమాలను వదులుకోకూడదని వెంకటేష్ స్పష్టం చేశారు.

నేను చేశానని ఈ సినిమా గురించి చెప్పడం లేదని సినిమాలో మంచి ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని వెంకటేష్ చెప్పుకొచ్చారు.వెంకటేష్ ప్రస్తుతం దృశ్యం2, ఎఫ్3 సినిమాలలో నటిస్తున్నారు.ఈ సినిమాల రిలీజ్ డేట్లు తెలియాలి ఉంది.

కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్న హీరో వెంకటేష్ ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

#Hero Venkatesh #Venkatesh #VenkateshAbout #Narappa Story #Soundarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు