వెంకటేష్‌ ఒకేసారి మూడు.. అరుదైన రికార్డ్‌  

ప్రస్తుతం టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్‌ మల్టీస్టారర్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మొదలు పెట్టిన వెంకటేష్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో మరో హీరోతో కలిసి నటించాడు. ప్రస్తుతం ఏకంగా మూడు మల్టీస్టారర్‌ చిత్రాలను వెంకీ చేస్తున్నాడు. వెంకీ మూడు మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే ఏడాది మూడు మల్టీస్టారర్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెంకీ రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.

Hero Venkatesh Record Breaks With Multi Starrer Movies-

Hero Venkatesh Record Breaks With Multi Starrer Movies

వెంకీ ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో కలిసి అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు. ఎఫ్‌ 2 చిత్రం విడుదలైన వెంటనే నాగచైతన్యతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంతో వెంకీ రాబోతున్నాడు. నాగచైతన్యతో చేస్తున్న సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. తాజాగా మరో మల్టీస్టారర్‌ ప్రారంభంకు సిద్దం అవుతుంది.

వెంకటేష్‌ ప్రస్తుతం చేస్తున్న రెండు మల్టీస్టారర్‌లతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చేయబోతున్నాడు. ఆ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో సూర్య కనిపించబోతున్నాడు. సూర్య దాదాపుగా ముప్పావు గంట పాటు చిత్రంలో కనిపిస్తాడని సమాచారం అందుతుంది. వెంకటేష్‌ మరియు సూర్యలు ఇద్దరు కూడా పోలీస్‌ ఆఫీసర్‌లుగా ఈ మల్టీస్టారర్‌లో కనిపించబోతున్నారు. సురేష్‌బాబు నిర్మించబోతున్న ఈ చిత్రం కోసం వచ్చే మార్చిలో సూర్య 30 రోజుల పాటు డేట్లు కేటాయించడం జరిగింది.

Hero Venkatesh Record Breaks With Multi Starrer Movies-

మొత్తానికి వెంకీ ఒకే ఏడాది మూడు మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. వెంకీ ముందు ముందు కూడా ఇలాగే మల్టీస్టారర్‌లు చేస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.