చిరంజీవితో ఉన్న ఈ చిచ్చరపిడుగులను గుర్తుపట్టారా..?

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు.ఆరు పదుల వయస్సులో కూడా ఎనర్జిటిక్ గా కనిపించే చిరంజీవి వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు.

 Tollywood Hero Varun Tej Shares Childhood Picture With Megastar Chiranjeevi , Ch-TeluguStop.com

ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్, బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.చిరంజీవి కొత్త కథలను కూడా వింటున్నారని తెలుస్తోంది.

చిరంజీవి నటుడిగా ప్రూవ్ చేసుకున్న తరువాత మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా ప్రూవ్ చేసుకున్నారు.అలా ప్రూవ్ చేసుకున్న నటులలో వరుణ్ తేజ్ కూడా ఒకరు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటోను షేర్ చేశారు.ఆ ఫోటోలో చిరంజీవి ఇద్దరు చిచ్చరపిడుగులను ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు.

Telugu Chiranjeevi, Lucifer, Niharika, Niharikachild, Varun Tej, Varuntej, Vedal

ఆ చిచ్చరపిడుగులలో ఒకరు వరుణ్ తేజ్ కాగా మరొకరు నిహారిక కావడం గమనార్హం.నిహారిక, వరుణ్ చిన్నప్పటి ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వరుణ్, నిహారిక చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.వరుణ్, నిహారిక సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నటులుగా సత్తా చాటడం గమనార్హం.వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో పాటు ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.

నిహారిక తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమాలో నటించగా ఆ సినిమా తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో రిలీజ్ అవుతోంది.ఈ సినిమాతో పాటు నిహారిక ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక మళ్లీ సినిమాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube