ఈ ఫోటోలో కనిపిస్తున్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “హ్యాపీ డేస్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన ప్రముఖ హీరో “వరుణ్ సందేశ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట్లో వరుణ్ సందేశ్ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాల్లో హీరోగా నటించి బాగానే అలరించాడు.

 Hero Varun Sandesh Shared His Childhood Memory With Parents-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు డిజాస్టర్లుగా మిగులుతున్నాయి.దీంతో సినిమాల పరంగా కొంత మేర జోరు తగ్గించాడు.

కాగా ఆ మధ్య ప్రముఖ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ 3 సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని 3వ విజేతగా నిలిచాడు.

 Hero Varun Sandesh Shared His Childhood Memory With Parents-ఈ ఫోటోలో కనిపిస్తున్న తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో నటుడు వరుణ్ సందేశ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

కాగా తాజాగా తన చిన్నప్పుడు తన తండ్రి, తల్లితో కలిసి దిగిన ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.అంతేకాకుండా ఈ ఫోటోకి అమ్మ, నాన్న, నేను అలాగే లవ్ సింబల్ ని క్యాప్షన్ పెట్టాడు.

దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతోంది.అంతేకాకుండా కొంత మంది వరుణ్ సందేశ్ అభిమానులు చిన్నప్పుడు వరుణ్ సందేశ్ చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం వరుణ్ సందేశ్ తెలుగులో “ఇందువదన” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి నూతన దర్శకుడు “శ్రీనివాస రవీంద్ర” దర్శకత్వం వహిస్తుండగా ముంబై బ్యూటీ “ఫర్నాజ్ శెట్టి” హీరోయిన్ గా నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కావడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

#Varun Sandesh #Induvadana #VarunSandesh #VarunSandesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు