సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ తో వైష్ణవ్ తేజ్..!

ఉప్పెనతో మెగా హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పటికే రెండు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు.ఉప్పెన భారీ హిట్ కొట్టడంతో మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.

 Vaishnav Tej Movie With Successful Producers, Krithi Shetty, Mega Hero, Mega Man-TeluguStop.com

ఈ క్రమంలో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.ఆల్రెడీ క్రిష్ డైరక్షన్ లో జంగిల్ బుక్ సినిమా రిలీజ్ కు రెడీ అవగా తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్య డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా షైన్ స్క్రీన్ బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడట వైష్ణవ్ తేజ్.దీనికి సంబందించిన కథా చర్చలు ముగిశాయని టాక్.

మజిలీ సినిమాతో నిర్మాతలుగా మారారు హరీష్ పెద్ది, సాహు గారపాటి.నానితో టక్ జగదీష్ కూడా తీశారు.

శ్రీవిష్ణు నటించిన గాలి సంపత్ సినిమాను వీరే రిలీజ్ చేశారు.సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న షైన్ స్క్రీన్ బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ సినిమా వస్తుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు సినిమా ఎలాటి కథతో వస్తుంది అన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది.సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Krithi Shetty, Mania, Producersharish, Sahu Garlapati, Shine Screen, Toll

మెగా హీరో వైష్ణవ్ తేజ్ సినిమాల లైనప్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు.చేసింది ఒక్క సినిమానే అయినా నటనలో మెగా పవర్ చూపించిన వైష్ణవ్ తేజ్ మిగతా మెగా హీరోల్లానే మెగా మేనియా కొనసాగించేలా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube