ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా.. వైష్ణవ్ తేజ్ కామెంట్స్ వైరల్..?

ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తొలి సినిమాతోనే నటుడిగా ప్రూవ్ చేసుకోవడం గమనార్హం.

 Hero Vaishnav Tej Interesting Comments About Heroine Sonakshi-TeluguStop.com

తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన వైష్ణవ్ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలను ఇస్తూ తన మనస్సులోని మాటలను బయటపెట్టారు.తన ఫేవరెట్ క్రికెటర్ ధోని అని వైష్ణవ్ తెలిపారు.

Telugu Favoruite Heroine, Rajinikanth, Sonakshi, Vasihnav Tej-Movie

క్రికెట్ ను తాను ఎంతగానో ఇష్టపడతానని తాను బ్యాట్స్ మెన్ అని ఐపీఎల్ టీమ్ లలో తన ఫేవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అని వైష్ణవ్ తెలిపారు.తనకు రెస్టారెంట్ ఫుడ్ కంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా నచ్చుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు.టీ లేదా కాఫీ బర్గర్ లేదా పిజ్జా అనే ప్రశ్నలకు వాటన్నింటినీ తాను ఇష్టపడతానని వైష్ణవ్ వెల్లడించారు.ఎప్పుడూ నవ్వుతూ కనిపించడానికి కారణమేమిటనే ప్రశ్నకు ఎదుటివారి నవ్వులోనే సంతోషం దాగుందని వైష్ణవ్ అన్నారు.

 Hero Vaishnav Tej Interesting Comments About Heroine Sonakshi-ఆమెను ప్రేమిస్తూనే ఉన్నా.. వైష్ణవ్ తేజ్ కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా తనకు గర్ల్ ఫ్రెండ్ లేదని వైష్ణవ్ వెల్లడించడం గమనార్హం.ఫేవరెట్ హీరో, ఫేవరెట్ మూవీ గురించి స్పందిస్తూ రజనీకాంత్ తన ఫేవరెట్ హీరో అని శివాజీ తన ఫేవరెట్ మూవీ వైష్ణవ్ తేజ్ అన్నారు.

అన్నం, టమోటా పచ్చడి తనకు ఇష్టమైన ఆహారం అని వైష్ణవ్ తెలిపారు.తాను చాలాసార్లు పరీక్షల్లలో తప్పానని ఎవరికీ తెలియని సీక్రెట్ ను వైష్ణవ్ తేజ్ వెల్లడించారు.

Telugu Favoruite Heroine, Rajinikanth, Sonakshi, Vasihnav Tej-Movie

ఉప్పెన మూవీలో బేబమ్మను చూసినప్పుడు వచ్చే ఫైట్ సీన్ తనకు ఎంతో ఇష్టమని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.సోనాక్షి అంటే ఎందుకు ఇష్టమని ఒక నెటిజన్ ప్రశ్నించగా సోనాక్షి అంటే తనకు ఇష్టం కాదని ఆమెను తాను ప్రేమిస్తున్నానని వైష్ణవ్ తెలిపారు.నజ్రియా తన ఫేవరెట్ హీరోయిన్ అని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు.

#Vasihnav Tej #Rajinikanth #Sonakshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు