హీరో విజయ్ కి చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్ హీరో..మరి ఇక్కడ సంగతేంటి..?

సినిమాల్లో నటులు హీరోలు గా మారాలంటే అందమైన రూపురేఖలు కలిగి ఉండాలి అలాగే ఇండస్ట్రీలో మనకు సంబంధించిన వారెవరైనా పెద్ద హోదాలో ఉండాలి అలా అయితేనే ఇక్కడ ఎవరికైనా హీరోలుగా నటించడానికి మొదటి అవకాశం దొరుకుతుంది.అయితే ఒకప్పుడు మోహన్ బాబుతో, చిరంజీవితో మంచి సినిమాలను తీసిన రవిరాజా పినిశెట్టి కొడుకు అయిన ఆది పినిశెట్టి తమిళ్ లో సినిమాలు చేసి మంచి హీరోగా గుర్తింపు పొందాడు.

 Hero Vaibhav Settled In Kollywood Industry-TeluguStop.com

ఇక్కడ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సాధించాడు.అలాగే ప్రొడ్యూసర్ ఏ.ఏం రత్నం కొడుకులైన రవి కృష్ణ 7/G బృందావన కాలని తో తెలుగులో హీరోగా పరిచయమై ఆ సినిమాతో మంచి గుర్తింపు సాధించినప్పటికీ తర్వాత ఆయన తీసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో తెలుగులో సినిమాలు చేయడం మానేశారు ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

అలాగే MM రత్నం ఇంకో కొడుకు అయిన జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా తరుణ్ హీరోగా నీ మనసు నాకు తెలుసు అనే సినిమా డైరెక్షన్ చేశాడు ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు దాంతో చాలా రోజుల తర్వాత ఈ మధ్య గోపిచంద్ తో ఆక్సిజన్ అనే సినిమా చేశాడు.

 Hero Vaibhav Settled In Kollywood Industry-హీరో విజయ్ కి చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్ హీరో..మరి ఇక్కడ సంగతేంటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదికూడా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అలాగే ప్రొడ్యూసర్ ఆర్ బి చౌదరి కొడుకు జీవ కూడా హీరోగా తమిళ్ లో సక్సెస్ అయ్యాడు.

డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి కొడుకు అయిన వైభవ్ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కోదండరామి రెడ్డి గొడవ అనే సినిమా చేశాడు ఆ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ తర్వాత నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కాస్కో సినిమా చేశాడు ఆ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయేసరికి తెలుగులో లో తమిళ్ లో కూడా అలాగే అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు.కానీ కోదండరామిరెడ్డి ఒకప్పుడు చిరంజీవి నీ మెగాస్టార్ చేయడంలో బాగా కృషి చేశాడు.

వరుస హిట్ల మీద హిట్లు ఇచ్చి సుప్రీం హీరో గా ఉన్న చిరంజీవినీ మెగాస్టార్ రేంజ్ కి తీసుకెళ్లడంలో చాలా వరకు ప్రయత్నం చేశాడు.

అయితే వైభవ్ తమిళ్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఏవి పెద్దగా ఆడలేదు దాంతో మియాదామన్ అనే సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది తళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమాను సైతం బీట్ చేస్తూ సూపర్ సక్సెస్ సాధించింది అప్పటి నుంచి వైభవ్ కెరియర్ గాడినపడి చాలా బాగా సాగుతుందని చెప్పవచ్చు.అయితే ఎంతో కష్టపడి తనతో సినిమా చేసి తనను హీరోగా నిలబెట్టలేకపోయాను అని ఎప్పటినుంచో బాధపడుతున్న కోదండరామ్ రెడ్డి గారు వైభవ్ మంచి హిట్ కొట్టడం తో చాలా సంతోషపడ్డారు అని చాలా మంది చెబుతుంటారు.

అయితే వైభవ్ తెలుగులో గొడవ, కాస్కో లాంటి సినిమాలు చేసినప్పటికీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హిందీ రీమేక్ చిత్రం కహాని సినిమాను తెలుగులో అనామిక పేరుతో చేశారు దీంట్లో నయనతారకు జోడిగా వైభవ్ నటించాడు తెలుగులో పెద్దగా చెప్పుకునే సినిమాలు లేనప్పటికీ తమిళంలో ఇప్పుడు ఇప్పుడే మంచి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు.ఒకప్పుడు వైభవ్ తండ్రి అయిన కోదండరాంరెడ్డి గారు పెద్ద డైరెక్టర్ అయిన కూడా ప్రస్తుతం తన కొడుకు కి హిట్ ఇచ్చే పరిస్థితిలో లేడు అని కోదండరాం రెడ్డి గారు తరచూ బాధ పడుతూ ఉంటారు.ఇండస్ట్రీలో అన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి స్టార్ హీరోగా ఉన్న వాళ్లు రేపటి రోజున పడిపోవచ్చు అలాగే ఇవాళ అవకాశం లేని వాళ్ళు సైతం రేపు స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

#KollywoodMovie #Vijay #Hero Vaibhav #HeroVaibhav #VaibhavTelugu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు