తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో చిరంజీవితో సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకున్న డైరెక్టర్లలో ఏ కోదండరామిరెడ్డి ఒకరు.ఈయన చిరంజీవి( Megastar Chiranjeevi )తో చాలా ఎక్కువ సినిమాలు చేసి వరుస సక్సెస్ లు అందుకున్నాడు.
ఒక విధంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కారణం కూడా ఈయనే… అలాంటి కోదండరామిరెడ్డి( Kodandarami Reddy ) ప్రస్తుతం డైరెక్షన్ చేయకుండా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

ఇక ఈయన కొడుకు అయిన వైభవ్( Hero Vaibhav Reddy ) తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన సినిమాలు ఇక్కడ పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.దాంతో ఆయన తమిళంలో సినిమాలు చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఒక యంగ్ డైరెక్టర్ తో తెలుగులో ఒక మంచి సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే ఈయన తెలుగులో గొడవ అనే ఒక సినిమా చేశారు దాంతో పాటుగా డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో కాస్కో( Kasko ) అనే సినిమా చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయాడు.
అక్కడ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా ఆయనకు గుర్తింపు తీసుకు రావడం లేదు.ఇక ఇంకోసారి ఓ మంచి సినిమా చేసి తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఆయన ప్రయత్నానికి అనుగుణంగానే ఇప్పుడున్న కొత్త డైరెక్టర్ ఆయనకి ఒక మంచి కథను వినిపించడం జరిగింది.దాంతో ఆయన కి కథ బాగా నచ్చి తెలుగులో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక వైభవ్ వాళ్ళ నాన్న కోదండరామిరెడ్డి ఒకప్పుడు చిరంజీవి లాంటి హీరోకి భారీ హిట్ ఇవ్వగలిగాడు.కానీ ఇప్పుడు తన కొడుకుకి ఒక హిట్ ఇవ్వడానికి ఆయన ఫామ్ లో లేకపోవడం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి.
ఇక ఈ సినిమాతో అయిన వైభవ్ తెలుగులో మంచి హీరోగా సెటిల్ అవుతాడో లేదో చూడాలి.