కమెడియన్ అలీకి బెదిరింపులు.. అసలు ఏమైందంటే?

తెలుగు సినీ స్టార్ కమెడియన్ అలీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన అలీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Hero Vadde Naveen Fans Fires On Comedian Ali Haro Vadde Naveen , Ali, Alitho Sar-TeluguStop.com

కామెడీ పరంగా తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఇక సినిమాలకు దూరంగా ఉన్న ప్రేక్షకులకు మాత్రం బుల్లితెరపై దగ్గరగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈయన ఈటీవీ లో ఆలీతో సరదాగా అనే ఓ రియాల్టీ షోలో వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.ఇందులో ఎంతో మంది సెలబ్రెటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకుంటాడు.

ఇలా ఎంతోమంది సెలబ్రెటీలను ఆహ్వానించిన ఆయనకు తాజాగా కొందరి నుండి బెదిరింపులు ఎదురయ్యాయి.

నిజానికి చాలా వరకు ఆలీతో సరదాగా షోలో వచ్చిన వాళ్లే మళ్లీ కనిపిస్తుంటారు.

ఇక ఈ షోపై అభిమానులు పెంచుకున్న ఆశలన్నీ నిరాశలవుతున్నాయి.యూట్యూబ్ లో ఈ షో గురించి ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉంటాయి.

తమ అభిమాన నటుల పేర్లు చెబుతూ వాళ్లని గెస్ట్ గా ఆహ్వానించామని కోరుతుంటారు.ఇలా చాలావరకు ఎంతోమంది అభిమానులు కోరగా ఈమధ్య మరో నటుడు వడ్డే నవీన్ ను గెస్ట్ గా తీసుకురావాలని ఆయన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Alitho Saradaga, Fans-Movie

ఒకప్పటి తెలుగు సినీ నటుడు వడ్డే నవీన్ కేవలం కొన్ని సినిమాలలో నటించిన కూడా మంచి గుర్తింపుతో పాటు మంచి అభిమానం ను కూడా సొంతం చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నవీన్ మళ్లీ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో అభిమానులు ఆయన కోసం తెగ ఆరాటపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఏ సెలబ్రిటులనైనా ఆహ్వానించి ప్రేక్షకులకు కనిపించేలా తన షో ద్వారా చేస్తుంటాడు అలీ.ఇక వడ్డే నవీన్ కూడా గెస్ట్ గా ఆహ్వానించమని ఆ ఎపిసోడ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చే బాధ్యత మాది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

Telugu Alitho Saradaga, Fans-Movie

ఇక అలీ మాత్రం ఈ కామెంట్స్ ను స్పందించకుండా వచ్చిన వారితో షోను నడిపిస్తున్నాడు.ఇక ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్న వడ్డే నవీన్ అభిమానులు ఈసారి రగిలిపోయారు.ఖబర్దార్ అలీ మర్యాదగా వడ్డే నవీన్ ని పిలవండి పిలుస్తారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అడిగిన వాళ్ళని కాకుండా వచ్చిన వాళ్లతోనే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారని మండిపడుతున్నారు.

వీడియోను అప్లోడ్ చేయడమే కాదు కింద కామెంట్ ను కూడా చదవరా అంటూ తెగ ఫైర్ అవుతున్నారు.మరి ఈ విషయం గురించి అలీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube