మా అమ్మను పచ్చి బూతులు తిట్టారు హీరో తనీష్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తాజాగా తన ప్యానల్ లో.విజయం సాధించిన వారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ క్రమంలో తన ప్యానల్ కి చెందిన 11 మంది విజయం సాధించిన వారు.రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.

ఈ తరుణంలో ప్యానల్ లో విజయం సాధించిన వాళ్ళు ఒక్కరు “మా” అధ్యక్ష ఎన్నికల టైంలో జరిగిన అనేక విషయాల గురించి మీడియా కి తెలియజేశారు.దీనిలో భాగంగా హీరో తనిష్.

మాట్లాడుతూ పోలింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు తనను దారుణంగా విమర్శించారని ఆరోపించారు.

ముఖ్యంగా తన తల్లిని కించపరిచేలా పచ్చి బూతులు తిట్టారని, ఆ సమయంలో బెనర్జీ అంకుల్ అడ్డు రావడంతో ఆయనను భయంకరంగా తిట్టారని.ఈ క్రమంలో మంచు మనోజ్ వచ్చి గొడవ జరగకుండా ఆపడం జరిగిందని తెలిపారు.ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా వివాదాలు గురించి మాట్లాడిన సందర్భాలు లేవని.

వివాదాలకు గొడవలకు చాలా దూరంగా ఉంటాను అని స్పష్టం చేశారు.అటువంటి వ్యక్తిత్వం కలిగిన నేను ఈసీ మెంబర్ గా గెలిచినా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో.పదవిలో కొనసాగే ఆలోచన లేదని.తనను నమ్మి ఓటేసిన వారందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నట్లు తనిష్ స్పష్టం చేశారు.

ముఖ్యంగా నావల్ల బెనర్జీ అంకుల్ మాటలు పడ్డారని ఆయన కి కూడా క్షమాపణలు అని.మంచు విష్ణు అదేరీతిలో మనోజ్.తనని ఒక బ్రదర్ మాదిరిగా ట్రీట్ చేయడం జరిగిందని.తనీష్ చెప్పుకొచ్చారు.

#MAA #Tanish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు