ఈ యంగ్ హీరోకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.హీరోయిన్లు పెళ్లైతే అవకాశాలు తగ్గుతాయని భావిస్తుండగా కొందరు హీరోలు పెళ్లైతే క్రేజ్ తగ్గుతుందని భావిస్తున్నారు.

 Hero Tanish Alladi Interesting Comments About Marriage,bigg Boss Season 2, Tanis-TeluguStop.com

అలా పెళ్లి చేసుకోని హీరోల్లో తనీష్ కూడా ఒకరు.దేవుళ్లు, మన్మథుడు సినిమాల్లో బాలనటుడిగా సినిమా కెరీర్ ను మొదలుపెట్టిన తనీష్ నచ్చావులే సినిమాతో హీరోగా సక్సెస్ ను అందుకున్నారు.

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే సినిమా తనీష్ తో పాటు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాధవీలతకు కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది.ఆ సినిమా తరువాత తనీష్ నటించిన రైడ్, మేం వయస్సుకు వచ్చాం సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నా మిగతా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి.

హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనడం ద్వారా తనీష్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

Telugu Tanish Alladi, Nachavule-Movie

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొన్నా ఆ షో తనీష్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి.అయితే ఈ హీరోకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.తాజాగా తనీష్ తన స్నేహితులతో కలిసి దిగిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ కాగా ఒక నెటిజన్ మీ గ్యాంగ్ లో తనీష్ కు తప్ప అందరికీ పెళ్లిళ్లు అయ్యయని.

తనీష్ కు పెళ్లెప్పుడు.? అని సోషల్ మీడియాలో ప్రశ్నించాడు.

నెటొజన్ అడిగిన ప్రశ్నకు తనీష్ స్నేహితులలో ఒక వ్యక్తి స్పందిస్తూ మ్యా గ్యాంగ్ అంతా తనీష్ కు పెళ్లి చేసే పనిలోనే ఉన్నాం అని రిప్లై ఇచ్చారు.అయితే తనీష్ మాత్రం పెళ్లి చేస్తే పిసికేస్తానంటూ ఒక జిఫ్ ఫైల్ ను షేర్ చేశాడు.

దీంతో తనీష్ కు పెళ్లిపై ఆసక్తి లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube