'వి' రిజల్ట్ తో గజగజా వణుకుతున్న స్టార్ హీరో?

నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ‘వి’ చిత్రం నిన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.తొలిసారి అమెజాన్ ప్రైమ్ లో భారీ చిత్రం విడుదల కావడంతో హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

 Hero Surya Worried About Nani V Movie Result,hero Surya, V Movie, Amazon Prime,-TeluguStop.com

అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘వి’ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

థియేటర్లలో ‘వి’ సినిమా రిలీజై ఉంటే దాదాపు పది కోట్ల రూపాయల వరకు దిల్ రాజుకు నష్టం వాటిల్లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వి సినిమా ఫ్లాప్ టాక్ వల్ల తమిళ స్టార్ హీరో సూర్య కూడా గజగజా వణుకుతున్నాడని తెలుస్తోంది.సూర్య నటించిన చిత్రం ఆకాశమే నీ హద్దురా ముందుగా అనుకున్న ప్రకారం లాక్ డౌన్ సమయంలో విడుదల కావాల్సి ఉంది.

అయితే లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఈ సినిమాను సూర్య చివరకు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అయితే అమెజాన్ లో ఇప్పటివరకు విడుదలైన చిన్న సినిమాలు కానీ, పెద్ద సినిమాలు కానీ సక్సెస్ కాలేదు. నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని సూర్య, సూర్య అభిమానులు భావించగా ‘వి’ అంచనాలను అందుకోలేదు.

దీంతో ఆకాశామే నీ హద్దురా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని సూర్య కంగారు పడుతున్నాడని తెలుస్తోంది.ఆకాశమే నీ హద్దురా సినిమా అయినా అమెజాన్ ప్రైమ్ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube