రాజకీయాల్లోకి సూర్య ఎంట్రీ .. నిజమేనా?

Hero Surya Reaction About Political Entry Rumours,hero Surya, Political Entry, Tamil Nadu Assembly Elections, Akashame Nee Haddu Raa Movie

2021 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో ప్రధానంగా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే పోటీ ఉండగా గత కొన్ని రోజుల నుంచి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 Hero Surya Reaction About Political Entry Rumours,hero Surya, Political Entry, T-TeluguStop.com

మూడు రోజుల క్రితం విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్టు ప్రచారం జరగగా ఆ తరువాత సూర్య పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజాగా సూర్య పొలిటికల్ ఎంట్రీ గురించి వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి వివరణ ఇచ్చారు.

తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు.సూర్య ఇప్పటికే ఒక ఎన్జీవో ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సూర్య ఫ్యాన్స్ ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.

సూర్య రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పడంతో ఊహాగానాలకు చెక్ పెట్టినట్లేనని అనుకోవాలి.అయితే సూర్య ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులోనైనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని సూర్యను సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.ఈ నెల 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటివరకు విడుదలైన ఓటీటీ సినిమాలన్నీ ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో ఆకాశం నీ హద్దురా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమా తెరకెక్కింది.

మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube