త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న అంటున్న స్టార్ హీరో సూర్య

తమిళంలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సూర్య.ఇక తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకి మంచి ఫాలోయింగ్ ఉంది.

 Hero Surya Plan To Movie With Trivikram Srinivas-TeluguStop.com

ప్రస్తుతం శ్రీ రాఘవ దర్శకత్వంలో ఎన్జీకె సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజా ఎన్జీకె తెలుగు ప్రమోషన్ కోసం వచ్చిన సూర్య ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.తాను ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సూర్య చెప్పుకొచ్చారు.

తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న అని, అతనికి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని, కచ్చితంగా అతని దర్శకత్వంలో సినిమా ఉంటుంది అని సూర్య చెప్పుకొచ్చాడు.ఇప్పటికే తమ ఇద్దరి మధ్య కథాపరమైన చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

త్రివిక్రమ్ తో సినిమా తప్పకుండా ఉంటుందని అంటున్నాడు ఇక జగన్ గురించి చెప్పుకోస్తూ జగన్ పదేళ్ళపాటు చాలా కష్టపడ్డాడని, దానికి తగిన ఫలితం వచ్చిందని, భవిష్యత్తులో లీడర్ గా ప్రజలందరికి గుర్తుండిపోయే స్థాయికి ఎదుగుతాడని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube