మణిరత్నం వెబ్ సిరీస్ లో నటించనున్న హీరో సూర్య  

Hero Surya plant to acted in Mani Ratnam web series, Tollywood, Kollywood, South cinema, digital entertainment - Telugu Digital Entertainment, Hero Surya Plant To Acted In Mani Ratnam Web Series, Kollywood, South Cinema, Tollywood

దర్శక దిగ్గజం మణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 Hero Surya Plan To Acted In Web Series

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా మొదలైంది.

ఈ నేపథ్యంలో చాలామంది నటులు, దర్శకులు వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.ప్రస్తుతం ఉన్న ఖాళీ సమయంలో వెబ్ సిరీస్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.

మణిరత్నం వెబ్ సిరీస్ లో నటించనున్న హీరో సూర్య-Movie-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా దర్శక దిగ్గజం మణిశర్మ కూడా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా వెబ్ సిరీస్ లు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.దాని కోసం ఇప్పటికే అద్భుతమైన కథలని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

మణిరత్నం నిర్మించబోయే ఈ వెబ్ సిరీస్ లో 11 ఎపిసోడ్ లు ఉంటాయని ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కొక్కరు దర్శకుడు ఉంటారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో ఒక దాని కోసం హీరో సూర్యని సంప్రదించినట్లు సమాచారం.

ఇక సూర్య కూడా కొంత టైం చేసుకుని వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఎపిసోడ్లు పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు.

మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంతవరకు ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Surya Plan To Acted In Web Series Related Telugu News,Photos/Pics,Images..