సురేష్. ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి నటుడు.పలు సినిమాల్లో హీరోగా చేశాడు.పలువురు హీరోయిన్లు తనతో జతగా సినిమాలు చేశారు.అలా తనతో నటించిన ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు నరేష్.కొంతకాలం వీరి ప్రేమాయణం నడిచింది.1990లో వివాహం చేసుకున్నారు.5 ఏండ్లు సంతోషంగా గడిపారు.ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.తాజాగా ఈ విషయాన్ని సురేష్ వివరించాడు.తానొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు.ఆమె తనతో సినిమాలు కూడా చేసిందన్నాడు.
తను మంచి సింగర్ అని చెప్పాడు.ఒక సమయంలో ఇద్దరు బాగా ఇబ్బందులు పడినట్లు చెప్పాడు.
సినిమా పరిశ్రమ నుంచి బయటకు వెళ్లి.విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని.
అక్కడే సెటిల్ కావాలని చెప్పినట్లు వెల్లడించాడు.అప్పుడు తన పరిస్థితి కూడా బాలేదని చెప్పాడు.
సినిమా పరిశ్రమను వదిలేద్దామని అనుకున్నాకే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు.అది కుదరకపోవడంతో ఇద్దరు విడిపోయినట్లు వెల్లడించాడు.
సురేష్ చెప్పిన ఆ అమ్మాయి మరెవరో కాదు.జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన బాబాయ్ అబ్బాయి సినిమాలో బాలయ్యతో కలిసి నటించిన అనితారెడ్డి.ఆమెకు అదే తొలి సినిమా.అంతకంటే ముందు సింగర్ గా సినిమా పరిశ్రమలో ఉంది.
దిగ్గజ సింగర్ జేసుదాసుతో కలిసి పలు సంగీత కచేరీల్లో ఆమె పాల్గొన్నది.ఆ తర్వాత పాప్ సింగర్ గా పేరు సంపాదించింది.
ఖైదీ సినిమాలో పాటలు కూడా పాడింది.శ్రీవారి శోభనం సినిమా కోసం హీరోయిన్ గా జంధ్యాల ఆమెను ఎంపిక చేశాడు.
కానీ ముందుకు బాబాయ్ అబ్బాయ్ సినిమా రిలీజ్ కావడంతో జనాలు ఆమె అదే సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినట్లు భావిస్తారు.
ఆ సినిమా తర్వాత భాను చందర్ టెర్రర్ మూవీలో సురేష్, అనిత కలిసి నటించారు.అప్పుడే వీరి మధ్య ప్రేమ ఏర్పడింది.తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.
ఆయనకు పెళ్లి అయ్యాక సురేష్ కు వరుస ఆఫర్లు వచ్చాయి.ఒక ఏడాదిలో ఏకంగా 18 సినిమాల్లో నటించాడు.
దీంతో ఆయన చాలా బిజీగా మారిపోయాడు.అంతకు ముందు సినిమాల నుంచి బయకు వెళ్లాలి అనుకున్నా.
ఆ నిర్ణయం వాయిదా పడింది.కానీ అనిత ఫోర్స్ చేయడం మొదలు పెట్టింది.
అబ్బాయి పుట్టాడు.అయినా తన నిర్ణయం మారకపోవడంతో విడాకులు తీసుకున్నారు.