అప్పట్లో సినిమా రీమేక్ చేస్తే నీ ట్యాలెంట్ ఏముందనేవారు.. కానీ ఇప్పుడు అన్నీ రీమేక్‌లే?

సినిమా అంటే ఒక కథ.ఇక ఈ కథను కథలా చెప్పకుండా అందులో కొన్ని రకాల నవరసాలతో, నటీనటులతో కలిసి రూపొందిస్తారు.

 Hero Suneel Andala Ramudu Movie Director Deepthi Criticized For Doing Remakes But Now All Are Remake Movies-TeluguStop.com

కథ అనేది ఎక్కడినుండో దొరకదు.కేవలం మనిషి ఆలోచనలో నుంచి కథ పుట్టి ఆ కథను అద్భుతంగా సృష్టించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే సినిమా.

ఇటువంటి సినిమాలు ఎన్నో భాషల్లో ఎన్నో రకాల కథలతో ఇప్పటివరకు లెక్కలేనంతగా తెరకెక్కాయి.

 Hero Suneel Andala Ramudu Movie Director Deepthi Criticized For Doing Remakes But Now All Are Remake Movies-అప్పట్లో సినిమా రీమేక్ చేస్తే నీ ట్యాలెంట్ ఏముందనేవారు.. కానీ ఇప్పుడు అన్నీ రీమేక్‌లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ మధ్య ఇతర భాషలకు చెందిన సినిమా కథలను కాపీ కొడుతున్నారు మన తెలుగు దర్శకులు.

ఇక తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల దర్శకులు కూడా కాపీ కొడుతున్నారు.ఇక వీటిని రీమేక్ అనే పేరుతో నటీనటులను మార్చి అచ్చం అదే కథతో రూపొందిస్తున్నారు.

దీంతో రీమేక్ సినిమాలలో దర్శకత్వం వహిస్తున్న దర్శకులకు ఇక్కడ ఎటువంటి టాలెంట్ అవసరం లేదు.

అక్కడి నుంచి మంచి హిట్ అయిన కథలను తెచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు.

నిజానికి అందులో కొత్తదనం ఏమీ ఉండదు.ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలే కాకుండా బాలీవుడ్, కోలివుడ్ నటులు కూడా రీమేక్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, బాలకృష్ణ, నితిన్ ఇలా పలువురు స్టార్ హీరోలే రీమేక్ సినిమాలకు అలవాటు పడుతున్నారు.

Telugu Balakrishna, Chiranjjevi, Criticized, Director Deepthi, Doing Remakes, Hero, Hero Suneel Andala Ramudu Movie, Maestro, Pawan Kalyan, Remake, Remake Movies, Tollywood, Vakeel Saab-Movie

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా రీమేక్ సినిమా అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీంతో అందరు స్టార్ హీరోలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రీమేక్ సినిమాలలో నటించడానికి వెనకాడటం లేదు.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలలో అది కూడా రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు.

చిరంజీవి కూడా రీమేక్ సినిమాలకు అలవాటు పడ్డాడు.ఇటీవలే నితిన్ నటించిన మాస్ట్రో సినిమా కూడా రీమేక్ సినిమానే.

ఇక సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా దర్శకులకు కూడా మంచి పేరును అందిస్తున్నాయి.

అసలు ఇందులో దర్శకులకు సొంత టాలెంట్ లేదు కానీ వాళ్లని పొగుడుతున్నారు.

ఇప్పుడు ఇదంతా బాగా ట్రెండ్ అయింది.కానీ ఒకప్పుడు ఓ దర్శకుడు ఓ రీమేక్ సినిమాను తెరకెక్కించాడు.

Telugu Balakrishna, Chiranjjevi, Criticized, Director Deepthi, Doing Remakes, Hero, Hero Suneel Andala Ramudu Movie, Maestro, Pawan Kalyan, Remake, Remake Movies, Tollywood, Vakeel Saab-Movie

దాంతో అతడిని రీమేక్ చేస్తే నీ టాలెంట్ ఎక్కడుంది అని బాగా విమర్శించారు.దాంతో ఆ దర్శకుడు మళ్లీ ఏ సినిమా కూడా చేయలేదు.ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు.కొన్ని సంవత్సరాల కిందట కమెడియన్ సునీల్ నటించిన అందాల రాముడు సినిమాకు దర్శకత్వం వహించిన దీప్తి.

ఈ సినిమాతో ఈయన మంచి హిట్ ను అందుకున్నాడు.కానీ ఆ తర్వాత ఏ సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు.

కారణం అతడిని కొందరు ప్రేక్షకులు నేరుగా విమర్శించారు.ఈ సినిమా కథ నీ సొంత కథ కాదు అని.రీమేక్ నుండి తెరకెక్కించావు అని ఇందులో నీ టాలెంట్ ఎక్కడ ఉంది అంటూ విమర్శలు చేయడంతో అతడు ఏమీ చెప్పలేకపోయాడు.

కానీ ఇప్పుడు అన్ని రీమేక్ సినిమాలే వస్తున్న కూడా మరి ఇప్పుడు దర్శకుల ప్రతిభా ఎక్కడ ఉంది అని ఎవరు ప్రశ్నించడం లేదు ఏంటి.

అంటే చూసే ప్రేక్షకులు కూడా రీమేక్ సినిమాలకు అలవాటు పడ్డారని తెలుస్తుంది.అంతేకాకుండా స్టార్ హీరోలు నటించడంతో పాటు ఆ రీమేక్ సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతుంది.

అందుకే ఇప్పుడు దర్శకులకు సొంత టాలెంట్ ఎక్కడ ఉంది అని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు.

#Balakrishna #Vakeel Saab #Maestro #Deepthi #Chiranjjevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు