సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ హిట్టా..? ఫ్లాపా..?

సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జీవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే.గత కొన్ని రోజుల నుంచి సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఈ సినిమాకు ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచారు.

 Hero Sundeep Kishan A1 Express Movie Hit Or Flop-TeluguStop.com

హాకీ నేపథ్యంలో హిందీలో సినిమాలు తెరకెక్కినా తెలుగులో సినిమాలు తెరకెక్కలేదు.హాకీ క్రీడాకారులు పడుతున్న కష్టాలతో పాటు రాజకీయ నాయకులు చేసే రాజకీయాల వల్ల క్రీడాకారులు ఏ విధంగా నష్టపోతున్నారో ఈ సినిమాలో చూపించారు.

సినిమాలో సందీప్ నాయుడు పాత్రలో సందీప్ కిషన్ నటించగా లావణ్య త్రిపాఠి లావణ్య అనే పాత్రలో కనిపించారు.మురళీశర్మ కోచ్ పాత్రలో రావు రమేష్ విలన్ పాత్రల్లో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు.

 Hero Sundeep Kishan A1 Express Movie Hit Or Flop-సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ హిట్టా.. ఫ్లాపా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సందీప్ తను ఇష్టపడిన అమ్మాయి కోసం కొన్ని కారణాల వల్ల గతంలో దూరమైన హాకీకి మళ్లీ దగ్గర కావాల్సి వస్తుంది.సందీప్ గతం ఏమిటి.? సందీప్ స్నేహితునికి జరిగిన అన్యాయం ఏమిటి.? గ్రౌండ్ ను కాపాడుకోవడం కోసం సందీప్ ఏం చేశాడు.? అనే ప్రశ్నలకు సమాధానమే ఏ1 ఎక్స్ ప్రెస్ కథ.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సరైన హిట్ లేని సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ కోసం తమిళ సినిమాను రీమేక్ చేశాడు.ఈ రీమేక్ సినిమాలో హాకీని చూపించడం వల్ల ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.సందీప్ కిషన్ తన పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.

సినిమా కథ బాగానే కథనంలో చిన్నచిన్న లోపాలు సినిమాకు మైనస్ గా మారాయి.ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ గా ఉంది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది.తెలుగు నేటివిటీకి తగినట్లు దర్శకుడు జీవన్ మార్పులు చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచే అవకాశం ఉంది.

#Sundeep Kishan #A1 Express #Sports Backdrop #A1Express #Hit Or Flop

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు