సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్న 'కపటధారి' టీజర్..!- Hero Sumanth Kapatadhari Teaser Released

Hero Sumanth Kapatadhari Movie Teaser, kapatadhari, hero sumanth, kavalu dhari, hero rana, Kapatadhari Movie, Sumanth next Movie, Kapatadhari Teaser - Telugu Hero Rana, Hero Sumanth, Hero Sumanth Kapatadhari Movie Teaser, Kapatadhari, Kapatadhari Movie, Kapatadhari Teaser, Kavalu Dhari, Sumanth Next Movie

హీరో సుమంత్ తాజాగా నటిస్తున్న కపటధారి టీజర్ విడుదలయింది.ఈ సినిమా టీజర్ చూస్తుంటే ప్రపంచంలో జరిగే చిన్న విషయం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉంటుందని అన్న పాయింట్ ను కారణం చేసుకొని కథను తెరకెక్కించినట్లు కనబడుతోంది.

 Hero Sumanth Kapatadhari Teaser Released-TeluguStop.com

అలాగే సినిమాలో ఏదో ఒక హత్యకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే విషయంలో తెరకెక్కించినట్లు క్లియర్ గా కనబడుతోంది.ఇక ఈ సినిమాలో హీరో సుమంత్ ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ లా కనబడుతున్నారు.

మొత్తంగా ఈ సినిమా చూస్తే ఓ క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కినట్లుగా అర్థమవుతోంది.

 Hero Sumanth Kapatadhari Teaser Released-సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్న కపటధారి’ టీజర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరో సుమంత్ కేసుకు సంబంధించి ” ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అవుతావా అని అడగడం, అందులో చివరికి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులే ఇందులో ఇన్‌వాల్వ్‌ కావద్దని ” సుమంత్ సన్నివేశాలు కనపడడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కనబడుతోంది.

టీజర్ చివర్లో ” కనబడే వాడు అస్సలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి ” అనే డైలాగుతో పాటు టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో వెరైటీ గా కనబడుతోంది.ఇకపోతే ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా ఎంతో ఆలోచించేలా కనబడుతుంది.

చివరి వరకు ఇంతకు ఆవేశాలు మార్చే వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే చిత్రబృందం ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అని తెలుపనున్నారు.ఈ సినిమాను కన్నడలో భారీ విజయం సాధించిన `కావ‌లుధారి` రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.

#Kavalu Dhari #Hero Rana #Hero Sumanth #Kapatadhari #HeroSumanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు