విడాకులపై హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్.. అదంతా ఇప్పుడు కామన్ అంటూ?

అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో సుమంత్ తాజాగా నటించిన చిత్రం మళ్ళీ మొదలైంది.

 Hero Sumanth Interesting Comments On Divorce Latest Interview Details, Sumanth,-TeluguStop.com

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి అయ్యింది.అంతే కాకుండా సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీ గా ఉన్నాడు హీరో సుమంత్.ఈ క్రమంలోనే ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమంత్ విడాకుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

ఈ నేపథ్యంలోనే సుమంత్ కు విడాకుల ప్రశ్న ఎదురయ్యింది.ఈ విషయంపై స్పందించిన సుమంత్. నాకు తెలిసి చాలా మంది విడాకులు తీసుకున్నారు.కుటుంబంలో కూడా విడాకులు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

అయితే దురదృష్టవశాత్తూ ఇప్పట్లో విడాకులు అన్నది కామన్ అయిపోయాయి అంటూ కూల్ గా సమాధానమిచ్చారు సుమంత్.అంతేకాకుండా ఈ విడాకుల విషయంలో తాను దురదృష్టం అన్న పదాన్ని వాడదలచుకోలేదని అలా జరిగిపోతున్నాయి అంతే అని అన్నాడు.

రెండవ పెళ్ళి విషయానికి వచ్చేసరికి కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతున్నారు అని తెలిపాడు సుమంత్.

ఎందుకంటే రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే అలాంటి వారిపై ఒక ముద్ర పడిపోతుందని చెప్పుకొచ్చాడు.అందుకే నేను రెండో పెళ్లి ఎలా అయినా కొనసాగించాలని అందరూ అనుకుంటున్నారు అంటూ సుమంత్ కాస్త ఆసక్తిగా స్పందించాడు.సుమంత్ నటించిన ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.

ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్ భార్యకు విడాకులు ఇచ్చే భర్త గా నటించాడు.

మొదట హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.మొదటి పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న సుమంత్ ఇప్పటివరకు రెండో పెళ్లి జోలికి పోలేదు.

Hero Sumanth Interesting Comments On Divorce Sumanth

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube