కొన్ని సినిమా కథలు కొందరు హీరోలకే సూట్ అవుతాయి.ఆ సినిమాలలోని హీరో పాత్రలో మరో హీరోను ఊహించుకోవడానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడరు.
అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు నటుడిగా అల్లు అర్జున్ కు మంచిపేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలోని పాత్రకు అల్లుఅర్జున్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
అయితే ఆ సినిమా స్టోరీని పూరీ జగన్నాథ్ హీరో సుమంత్ కు వినిపించగా సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చెంతకు చేరింది.కపటధారి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సుమంత్ దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన దేశముదురు కథ తనకు ఎంతగానో నచ్చిందని కానీ ఆ సినిమాలోని హీరో పాత్రకు తాను సూట్ కానని అనిపించిందని పేర్కొన్నారు.
అందువల్ల ఆ మూవీ ఆఫర్ ను తాను రిజెక్ట్ చేశానని తెలిపారు.
తాను దేశముదురు మూవీలో హీరోగా నటిస్తే సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుని ఉండేదని సుమంత్ అభిప్రాయపడ్డారు.
అల్లు అర్జున్ దేశముదురు మూవీలో నటించాడు కాబట్టే ఆ మూవీ సక్సెస్ అయిందని తెలిపారు.ఎన్నో కథలను విన్నా అన్ని కథలకు తాను సూట్ అవుతానని భావించనని.
ఆ సినిమా కథ వేరే హీరోలకు సూట్ అవుతుందని భావిస్తే వాళ్లకు ఆ కథను వినాలని సూచిస్తానని పేర్కొన్నారు.
తను నటించిన మళ్లీ రావా సినిమా హిట్ కావడంతో ఆ మూవీ తరువాత తాను రొమాంటిక్ మూవీస్ ఆఫర్లు వస్తాయని భావించానని.
కానీ ఊహించని విధంగా థిల్లర్ స్టోరీస్ తో దర్శకులు తనను సంప్రదిస్తున్నారని సుమంత్ పేర్కొన్నారు.మరోవైపు కపటధారి సినిమాకు యావరేజ్ టాక్ వస్తుండగా ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.