ఆ రెండు సినిమాలు మాత్రమే రిజెక్ట్ చేశా.. సుమంత్ కీలక వ్యాఖ్యలు..?

1999 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు సుమంత్.జయాపజయాలకు అతీతంగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సుమంత్ కెరీర్ లో కమర్షియల్ హిట్ల కంటే సుమంత్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

 Hero Sumanth Has Given Shock To Troller And His Tweet Become Viral-TeluguStop.com

గత నెలలో సుమంత్ హీరోగా నటించిన కపటధారి సినిమా విడుదలై బిలో యావరేజ్ గా నిలిచింది.

అయితే కపటధారి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ దేశముదురు సినిమాలో నటించే ఛాన్స్ రాగా ఆ పాత్రకు తాను సరిపోనని భావించి రిజెక్ట్ చేసినట్లు సుమంత్ చెప్పుకొచ్చారు.

 Hero Sumanth Has Given Shock To Troller And His Tweet Become Viral-ఆ రెండు సినిమాలు మాత్రమే రిజెక్ట్ చేశా.. సుమంత్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా నువ్వేకావాలి, తొలిప్రేమ, అష్టాచమ్మా, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, నువ్వు వస్తావని, దేశముదురు, గమ్యం, ఆనందం, ఇడియట్, మనసంతానువ్వే సినిమాల్లో సినిమాలలో నటించే ఛాన్స్ వస్తే సుమంత్ రిజెక్ట్ చేశాడని పేర్కొన్నారు.

ఈ సినిమాలలో సుమంత్ ఒకవేళ నటించి ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమంత్ ఈపాటికి స్టార్ హీరోగా ఉండేవారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ ట్వీట్ సుమంత్ దృష్టికి రావడంతో వాస్తవాలను తెలుసుకోవాలని కేవలం నువ్వేకావాలి, దేశముదురు అనే సినిమాలలో నటించే ఛాన్స్ తనకు రాగా ఆ రెండు సినిమాలను మాత్రం రిజెక్ట్ చేశానని పేర్కొని ట్వీట్ చేసిన వ్యక్తికి ఝలక్ ఇచ్చారు.

సుమంత్ ప్రస్తుతం వాల్తేరు శీను అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సత్యం, గౌరి, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా, సుబ్రహ్మణ్యపురం సినిమాలు సుమంత్ కెరీర్ కు ప్లస్ అయ్యాయి.

పౌరుడు, బోణీ, రాజ్, ఏమో గుర్రం ఎగరవచ్చు, దగ్గరగా దూరంగా, నరుడా డోనరుడా, ఇదం జగత్ సినిమాలు సుమంత్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి.

#Sumanth Career #Rejected Movies #Flop Movies #Kapatadari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు