అక్కినేని వారసులకు ఈ దుస్థితేంటి.. కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ?

టాలీవుడ్ హీరో అక్కినేని వారసుడు సుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ప్రేమ కథ సినిమాతో వెండితెరకు పరిచయమైన సుమంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.

 Hero Sumanth And Supriya Attends Court Check Bounce Case, Sumantha, Supriya, Che-TeluguStop.com

తెలుగులో స్నేహమంటే ఇదేరా, సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్ ఇలాంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత నటించిన సినిమాలు కొన్ని వరుసగా పరాజయాలు పాలయ్యాయి.

ఆ తర్వాత సుమంత్ మళ్ళీరావా సినిమాతో మంచి టాక్ ను అందుకున్నాడు.

అయితే ఎన్నో రకాల సినిమాలలో నటించి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు సుమంత్.

కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ మధ్య ఒక సారి ఇంట్లో పెళ్లి జరగబోతుంది అంటూ, సుమంత్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే సుమంత్ తన కెరీర్ లో నటించిన సినిమాలు ఫ్లాపులు హిట్లు అని ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూ పోతున్నాడు.

Telugu Bounce, Sumantha, Supriya, Tollywood-Movie

ఇదిలా ఉంటే నరుడా ఓ నరుడా సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.ఈ సినిమాకు సంబంధించి తనకిచ్చిన చెక్.చెక్ బౌన్స్ అయిందని మార్కాపురం కోర్టులో ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు కోర్టులో కేసు వేశారు.

నరుడా ఓ నరుడా అనే సినిమాకు హీరోగా సుమంత్, నిర్మాతగా సుప్రియ వ్యవహరిస్తున్నారు.ఆ సినిమాకు కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించారు.ఈ వ్యవహారంలో తనను మోసం చేశారని కారుమంచి శ్రీనివాస్ మార్కాపురంలో కేసు వేశారు.ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియతో తాజాగా గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube