అర్దరాత్రి బాంబు బెదిరింపు ..అంతే 6 నెలల పాటు డార్క్ సెల్ లో హీరో సుమన్

సుమన్ తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటే కాదు.సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అద్భుతమైన నటుడు.

 Hero Suman Struggling Days In Jail-TeluguStop.com

ఒకప్పుడు ఆయన డేట్స్ కోసం నిర్మాతలు పడిగాపులు కాసేవారు.తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు తహతహ లాడేవారు.

సుమన్ తో సినిమా అంటే హిట్ పడినట్లుగానే భావించేవారు దర్శక నిర్మాతలు.నిజానికి సుమన్ అందగాడు ఒక్కటే కాదు.

 Hero Suman Struggling Days In Jail-అర్దరాత్రి బాంబు బెదిరింపు ..అంతే 6 నెలల పాటు డార్క్ సెల్ లో హీరో సుమన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తి.దీంతో ఆయన ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది.

ఆయన సినీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగా తన జీవితంలో కొనుకోలేని దెబ్బ పడింది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1985.మే 19న సుమన్ ఇంట్లోకి అర్థరాత్రి సమయంలో పోలీసులు వచ్చారు.ఇంట్లో బాంబు ఉంది అని చెప్పడంతో వెతకమని చెప్పాడు.ఇల్లు అంతా గాలించి లేదన్నారు.సుమన్ ను స్టేషన్ కు రావాలని చెప్పారు.తన తల్లి మాట ప్రకారం పీఎస్ కు వెళ్లినట్లు చెప్పాడు సుమన్.

అరగంటలో ఇంటికి పంపిస్తామని చెప్పి తెల్లవారి 8 అయ్యే వరకు స్టేషన్ లొనే ఉంచారు.ఎందుకు తనను ఇక్కడ ఉంచారు అని అడిగినా పోలీసుల నుంచి సమాధానం లేదు.

మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లారు.అమ్మాయిలను వేధించడం, నీలి చిత్రాలు తీసాడు అనే అభియోగాలు మోపారు.

పలు నాన్ బెయిలబుల్ కేసులు మోపారు.కోర్టు రుజువు అడిగితే విచారణ కొనసాగుతోంది అని పోలీసులు చెప్పారు.

దీంతో ఆయన్ను జైలుకు పంపారు.జైల్లో ఉగ్రవాదులను ఉంచే డార్క్ సెల్లో పడేసారు.

అందులో నరకయాతన అనుభవించాడు.కొద్దిరోజుల తర్వాత ఒక ఆందోళన విషయంలో అరెస్ట్ అయిన కరుణానిధి జైలుకు వెళ్ళాడు.

అప్పుడు సుమన్ ను చూసి జైలు అధికారులు తీరుపై మండిపడ్డారు.వెంటనే తనను డార్క్ రూమ్ నుంచి బయటకు తీసుకురావాలన్నారు.

కరుణానిధి కి సుమన్ మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

Telugu 6 Months, Dark Room, Hero Suman, Karunanidhi, Suhasuni, Sumalatha, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అటు సినిమా పరిశ్రమ నుంచి సుమన్ కు సరైన మద్దతు రాలేదు.కేవలం సుహాసిని, సుమలత మాత్రమే ఆయనకు సపోర్టుగా మాట్లాడారు.అప్పుడప్పుడు సినిమా నిర్మాతలు ఆయనను కలవడానికి వచ్చినా వారి సినిమాల గురించే మాట్లాడి వెళ్లేవారు.

అటు దేశంలోని ప్రముఖ లాయర్లు సుమన్ తరఫున వాదించారు.నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ రావడం అదే తొలిసారి దేశంలో.

సుమారు 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యాడు సుమన్.నాలుగు గోడల మధ్య నుంచి బయటకు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో తనకు తొలిసారి తెలిసింది అన్నాడు సుమన్.

అసలు తాను చేయని నేరాలకు జైలు పాలు ఎందుకు చేశారో? ఎవరు చేశారో? ఇప్పటికీ తనకు తెలియదు అన్నాడు.

#Suhasuni #Dark Room #Hero Suman #Karunanidhi #6 Months

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు