జైలు నుంచి వచ్చాక సుమన్ కెరీర్ ని నిలబెట్టిన సినిమా ఇదే

సీనియర్ హీరో సుమన్ గురించి అందరికీ తెలుసు.మొదట్లో సినీ ఇండస్ట్రీకి విలన్‌గా పరిచయమైన ఆయన ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి ఎదిగారు.

 Hero Suman Career Turning Movie Completes 33 Years, Hero Suman, Suman, Bandipotu, Megastar Chiranjeevi-TeluguStop.com

పలు చిత్రాల్లో నటించి విజయాలు సాధించారు.సుమన్ నటించిన బందిపోటు సినిమా 33 ఏళ్లు పూర్తి చేసుకుంది.

టీఆర్ తులసి నిర్మాతగా వ్యవహరించారు.అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ ప్రసాద్ సమర్పణలో బందిపోటు సినిమా రిలీజ్ అయింది.1988 ఆగస్టు 4న విడుదలైనసినిమా టీఎల్‌వీ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో పూర్ణిమ, కల్పన, గౌతమి, శివకృష్ణ, నూతన్ ప్రసాద్, కోటా శ్రీనివాస్,వీరభద్రరావు, రంగనాథ్, డిస్కో శాంతి, వెంకటేశ్వర రావు, చంద్రిక, మోహన్ కుమార్, ఓంకార్, వినోద్.

 Hero Suman Career Turning Movie Completes 33 Years, Hero Suman, Suman, Bandipotu, Megastar Chiranjeevi-జైలు నుంచి వచ్చాక సుమన్ కెరీర్ ని నిలబెట్టిన సినిమా ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పలువురు నటీనటులు కీలక పాత్రలో నటించారు.

కాగా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రాజ్ కోటీ స్వరాన్ని అందించారు.

వేటూరి సుందర రాంమూర్తి సాహిత్యం అందించిన బందిపోటు సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

హీరో సుమన్‌కు బందిపోటు సినిమానే టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.సుమన్‌కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు.అయితే బంధిపోటు సినిమా 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో సుమన్ సినిమాతో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు./br>

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది.చాలా సంతోషంగా ఉన్నాను.నేను నటించిన బందిపోటు సినిమా 33 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సినిమా అప్పట్లోనే మంచి హిట్ ఇచ్చింది.ఈ సినిమా వల్లే నా కెరియర్ టర్న్ అయింది.

కాట్రగడ్డ ప్రసాద్ నిర్మాతగా.టీఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బిగ్గేస్ట్ హిట్ అందుకుంది.

బందిపోటు సినిమాకు 33 ఏళ్లు పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉంది.దర్శకుడు ప్రసాద్ ఎంతో ధైర్యంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో నటించిన నటీనటులు, ఆర్టిస్టులు అద్భుతంగా నటించారు.ఈ సక్సెస్ అందరి సొంతం.

’’ అని ఆయన పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube