మహిళ ప్రాణం తీసిన హీరో హై స్పీడ్

లైవ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుధాకర్ కొమాకుల.ఈ కుర్ర హీరో చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టం టెస్ట్ చేసుకునే పనిలో ఉన్నాడు.

 Hero Sudhakar Komakula Injuries In Car Accident1-TeluguStop.com

నువ్వు తోపురా సినిమాతో మే 3న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్న ఈ కుర్ర హీరోని దురదృష్టం కారు రూపంలో వెంటాడింది.

గుంటూరుకి సినిమా ప్రమోషన్ కోసం వెళ్తున్న టైంలో ఊహించని విధంగాజాతీయ రహదారి మీద సుధాకర్ కొమాకుల కారుతో ఓ మహిళని గుద్దడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది.

ఇక స్పీడ్ కంట్రోల్ చేసుకునే టైంలో కారు కూడా అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని గుద్ది నుజ్జయ్యింది.ఈ ప్రమాదంలో హీరో సుధాకర్ కి కూడా బలమైన గాయాలు అయ్యాయి.

దీంతో అతనిని హుటాహుటిన హాస్పిటల్ లో తరలించారు.ఇక చనిపోయిన మహిళ ఎవరనేది తెలియరాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube