కొడుకు సినిమాలో సందడి చేస్తోన్న తండ్రి

టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.ఈ హీరో చేసిన సినిమాలు అప్పట్లో సెన్సేషనల్ హిట్లుగా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టేవి.

 Hero Srikanth Cameo In Son Roshan Pellisandadi-TeluguStop.com

అయితే కాలక్రమంలో శ్రీకాంత్ విభిన్న పాత్రలు ట్రై చేస్తూ ప్రస్తుతం ఫేడవుట్ అయిపోయాడు.అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నా ఆయనకు అదిరిపోయే హిట్లు మాత్రం లేవనే చెప్పాలి.

ఇక ఇప్పుడు శ్రీకాంత్ తన కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు.గతంలో ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమలో పరిచయమైన రోషన్, ఈసారి పూర్తి హీరోగా మనకు కనిపించిన సంగతి తెలిసిందే.

 Hero Srikanth Cameo In Son Roshan Pellisandadi-కొడుకు సినిమాలో సందడి చేస్తోన్న తండ్రి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించినా కూడా అది చైల్డ్ ఆర్టిస్ట్ కిందకే రావడంతో ఈసారి పూర్తి హీరోగా మనముందుకు వచ్చేందుకు రోషన్ రెడీ అయ్యాడు.దర్శకేంద్రుడు కె.

రాఘవేంద్రరావు తెరకెక్కించిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘పెళ్లిసందడి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఆయన కొడుకు రోషన్‌ను దర్శకేంద్రుడు మనముందుకు తీసుకొస్తున్నారు.అయితే తనకు ఎంతో పేరును, విజయాన్ని అందించిన పెళ్లి సందడి సీక్వెల్‌లో ఓ కేమియో పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను గౌరీ అనే దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్నట్లు దర్శకేంద్రుడు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అయిన పెళ్లిసందడి సీక్వెల్‌లో తన కొడుకుతో పాటు తాను కూడా కనిపించడం తనకు సంతోషంగా ఉందని, ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు.

ఇక ఈ సినిమా తనలాగే తన కొడుక్కి కూడా మంచి విజయాన్ని అందించి, అతడి కెరీర్‌కు బూస్ట్ ఇస్తుందని శ్రీకాంత్ ఆశిస్తున్నాడు.ఏదేమైనా పెళ్లిసందడి చిత్రం అటు తండ్రి శ్రీకాంత్‌తో పాటు కొడుకు రోషన్‌కు కూడా మంచి పేరు తీసుకువస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

#Roshan #Raghavendra Rao #Pelli Sandadi #Srikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు