తెలంగాణ దేవుడు కాబోతున్న శ్రీకాంత్..?  

ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం బయోపిక్ ల చుట్టూ తిరుగుతోంది. ప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తూ వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి న విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మహానటి పేరుతో సావిత్రి జీవితం తెరకెక్కగా, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణంలో ఉంది. అలాగే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ కోవలోనే ఇప్పుడు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ జీవితం బయోపిక్ రూపంలో తెరకెక్కబోతుంది.

Hero Srikanth Acting In Kcr Biopic Telangana Devudu-

Hero Srikanth Acting In Kcr Biopic Telangana Devudu

తెలంగాణ దేవుడు పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో కేసిఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రాన్ని తెలంగాణ ఎన్నికల సమయానికి తెరమీదకు తీసుకువచ్చారు ప్రయత్నిస్తున్నారు అయితే ఎన్నికల కోడ్ నేపద్యంలో ఈ చిత్రంపై ప్రతిపక్షాలు అవకాశం కనిపిస్తోంది. నటుడు, రచయిత, ఉత్తేజ్‌ కూడా ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాడని సమాచారం. మ్యాక్‌ ల్యాబ్స్‌. ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వంలో మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.