చిత్రయూనిట్ కు కానుకలిచ్చిన స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమా మానాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయింది.

 Simbu Gifted Wrist Watches To Movie Unit, Gift, Kollywood Hero, Maanaadu, Movie, Politcal Action Thriller, Simbu, Simbu Maanaadu, Unit, Venkat Prabhu, Wrist Watches-TeluguStop.com

సినిమా పూర్తయిన సందర్భంగా హీరో శింబు చిత్రయూనిట్ అందరికి కానుకలు ఇచ్చాడు.ఇంతకీ శింబు ఇచ్చిన కానుకలు ఏంటి అంటే రిస్ట్ వాచ్ (చేతి గడియారాలు) అని తెలుస్తుంది.

మానాడు సినిమాకు పనిచేసిన చిత్రయూనిట్ మొత్తం 168 మంది సిబ్బందికి రిస్ట్ వాచ్ లను ఇచ్చాడట శింబు.స్టార్ హీరో ఇచ్చిన కానుకకు చిత్రయూనిట్ మొత్తం అతనితో సెల్ఫీలు దిగి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.

 Simbu Gifted Wrist Watches To Movie Unit, Gift, Kollywood Hero, Maanaadu, Movie, Politcal Action Thriller, Simbu, Simbu Maanaadu, Unit, Venkat Prabhu, Wrist Watches-చిత్రయూనిట్ కు రిస్ట్ వాచ్ కానుకలిచ్చిన స్టార్ హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమా విషయానికి వస్తే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా నటిస్తున్న ఈ సినిమాలో శింబు సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది.టీజర్ తో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమాలో ఎస్.జే సూర్య విలన్ గా నటిస్తున్నారు.వీరితో పాటుగా అమరన్, ప్రేం జీ, అంజెనా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Telugu Gift, Kollywood Heri, Maanaadu, Thriller, Simbu, Simbu Maanaadu, Unit, Venkat Prabhu, Wrist Watches-Movie

ఒకప్పుడు తెలుగులో శింబుకి క్రేజీ ఫ్యాన్స్ ఉండేవారు.శింబు నటించిన మన్మథ, వల్లభ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. మానాడుతో తెలుగులో మళ్లీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు శింబు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube