సూపర్‌ స్టార్‌ల అసమర్ధతపై హీరో సిద్దార్థ్‌ అదిరిపోయే ట్వీట్

ప్రధాని నరేంద్ర మోడీ మరియు ప్రభుత్వంపై హీరో సిద్దార్థ్‌ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యంగంగా ట్వీట్స్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటాడు.ప్రధాని నరేంద్ర మోడీ ని అన్ని విధాలుగా అసమర్థ ప్రధాని అంటూ ఆమద్య సిద్దార్థ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

 Hero Sidharth Comments On Top Stars And Celebrates-TeluguStop.com

ఇప్పుడు మరోసారి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.ప్రస్తుతం కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కాని ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.ఈ విషయమై ప్రముఖులు ముఖ్యంగా సెలబ్రెటీలు ఎవరు కూడా ప్రభుత్వంను విమర్శించడం లేదు అంటూ సిద్దార్థ్‌ ఇండైరెక్ట్‌ గా ఒక ట్వీట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

 Hero Sidharth Comments On Top Stars And Celebrates-సూపర్‌ స్టార్‌ల అసమర్ధతపై హీరో సిద్దార్థ్‌ అదిరిపోయే ట్వీట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సిద్దార్థ్‌ ట్విట్టర్ లో.ఎవరైతే మిలియన్‌ ల కొద్ది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారో వారు సైలెంట్‌ గా ప్రస్తుతం జరుగుతున్న హర్రర్‌ షో ను చూస్తున్నారు.వారు సైలెంట్‌ గా ఉండటం కు కారణాలు వారికి ఉన్నాయి.ప్రముఖులు వారి వారి కారణాల వల్ల మౌనంగా ఉంటూ ఉన్నారు.మరి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు.నీవు మాట్లాడాలి.

నీవు ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రశ్నించాలి కదా అంటూ జనాలను ఉత్తేజ పర్చే విధంగా ట్వీట్‌ చేశాడు.ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు.

మీరు ప్రశ్నించకుంటే చాలా కోల్పోవాల్సి వస్తుందని ఈ సందర్బంగా అన్నాడు.సినీ ప్రముఖులు ఎవరు కూడా కేంద్రంకు వ్యతిరేకంగా మాట్లాడక పోవడం ను సిద్దార్థ్‌ ఇండైరెక్ట్‌ గా టార్గెట్‌ చేశాడు.

మరి ఇప్పటికి అయినా ప్రముఖు ల్లో స్పందన వస్తుందా అనేది చూడాలి. సిద్దార్థ్‌ ప్రస్తుతం శర్వానంద్‌ తో కలిసి మహా సముద్రం సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.

#Modi #Top Stars #Hero Sidharth #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు