హీరో సిద్ధార్థ్ కు గర్వం.. అందుకే ఇండస్ట్రీ ఇన్నాళ్లు తొక్కేసిందంటూ?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు మొదటిసారి ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పుడు ఒకలా ఉంటే ఒక హోదాను సంపాదించుకున్నాక మరోలా ఉంటారు.అంతేకాకుండా వారికి ఎక్కడ లేని గర్వం అనేది కూడా వస్తుంది.

 Hero Siddharth Has Proud Is Thay Why Siddharth Not Getting Movie Offers In Tollywood Industry-TeluguStop.com

అలా చాలా వరకు నటీనటులు స్టార్ హోదా ను సంపాదించుకున్నాక వాళ్లలో పొగరు తనం వంటి వస్తే మాత్రం అతి తక్కువ సమయంలోనే వాళ్లని ఇండస్ట్రీ తొక్కేస్తుంది.అలా నటుడు సిద్ధార్థ్ కూడా అలాంటి పరిస్థితినే తెచ్చుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు.కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Hero Siddharth Has Proud Is Thay Why Siddharth Not Getting Movie Offers In Tollywood Industry-హీరో సిద్ధార్థ్ కు గర్వం.. అందుకే ఇండస్ట్రీ ఇన్నాళ్లు తొక్కేసిందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈయన తెర ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తెరవెనుక మాత్రం బాగా వైలెంట్.ముక్కుసూటిగా తన నోటికి వచ్చే విధంగా అవతలి వారి పై విమర్శలు చేస్తూ ఉంటాడు.

ఈయన 2003లో బాయ్స్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో కూడా నటించాడు.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వివాదాలు రావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వగా ఓ సినిమాలో బిజీగా ఉన్నాడు.

Telugu Ajay Bhupathi, Bommarillu, Film Industry, Hero, Hero Siddhart Proud Feeling, Hero Siddharth Mahasamudram Movie, Proud, Sharwanand, Siddharth, Siddharth Movie Offers-Movie

ఇదిలా ఉంటే గతంలో ఈయన సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి అసలు కారణం మరొకటి ఉంది.ఈయన బొమ్మరిల్లు సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఈ సినిమాలో తాను గుర్తింపు తెచ్చుకునేందుకు అతనిలో ఒక గర్వం అనేది వచ్చింది.ఇక ఆ గర్వాన్ని సినీ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చూపించాడు.సినీ ఇండస్ట్రీలో బాగా ఓవర్ చేయడం వల్ల ఎక్స్ ట్రా మాటలు మాట్లాడటం వల్ల అతని పద్ధతి దర్శక నిర్మాతలకు నచ్చకపోవడంతో ఇన్నాళ్లు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టడంతో పాటు అతడిని ఇండస్ట్రీ కూడా తొక్కేసింది అని గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు వినిపించాయి.

ఇక సోషల్ మీడియాలో కూడా సిద్ధార్థ్ బాగా యాక్టివ్ గా ఉంటాడు.

Telugu Ajay Bhupathi, Bommarillu, Film Industry, Hero, Hero Siddhart Proud Feeling, Hero Siddharth Mahasamudram Movie, Proud, Sharwanand, Siddharth, Siddharth Movie Offers-Movie

తనకు నెగెటివ్ కామెంట్లు వస్తే మాత్రం తన నోటికొచ్చిన బూతులతో నెటిజన్లను తిడుతుంటాడు.దీంతో సిద్ధార్థ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి.ఇటీవలే ఓ నెటిజన్ సిద్ధార్థ్ వయసు గురించి ట్రోల్ చేయగా వారిపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు.

ఇదిలా ఉంటే మళ్లీ ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నాడు.ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమాతో సిద్ధార్థ్ ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

#Ajay Bhupathi #Siddhart Proud #Proud #Siddharth #Bommarillu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు