వేషం మార్చుకున్న హీరో శివాజీ

టాలీవుడ్ హీరో శివాజీ అంటే ఎంత మంది గుర్తుపడతారు అనేది తెలియదు గానీ ఆపరేషన్ గరుడ శివాజీ అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో ఆపరేషన్ గరుడ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మీడియాలో కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి హీరో శివాజీ.

 Hero Shivaji News Look Viral In Social Media-TeluguStop.com

కెరియర్ లో హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత ఊహించని విధంగా అతను రాజకీయాల వైపు టర్న్ తీసుకొని తాను ఏ పార్టీకి అనుకూలం కాదని చెబుతూనే టీడీపీకి మద్దతుగా మాట్లాడుతూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు.

ప్రత్యేక హోదా అనే అంశాన్ని రెండేళ్లపాటు బలంగా వినిపించిన శివాజీ ఎన్నికల తర్వాత కూడా అ ఎలక్షన్ కౌంటింగ్ ముందు ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఫలితాలు చాలా మందికి షాకివ్వబోతున్న అని చెప్పుకొచ్చాడు.అయితే ఊహించని విధంగా వైసీపీ భారీ విజయం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి టీవీ9 ఇష్యులో శివాజీ చుట్టూ వార్తలు వినిపించాయి.

ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న శివాజీ తాజాగా ఊహించని అవతారంలో దర్శనం ఇచ్చాడు.తన రెగ్యులర్ లుక్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి సినిమాటిక్ స్టైల్లో చార్లీ చాప్లిన్ గెటప్ లో కనిపించే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లో రిలీజ్ చేశాడు.

ఇప్పుడు ఈ వీడియోలో శివాజీ లుక్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube