'రంగం' చిత్రంలో హీరో జీవా కంటే ముందు ఏ హీరో నటించాడంటే..?!

2011 సంవత్సరంలో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ సినిమా ‘ కో ‘.ఇదే సినిమాను టాలీవుడ్ లో ‘ రంగం ‘ అనే పేరుతో కె.వి.ఆనంద్ దర్శకత్వం లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిన విషయమే.అయితే ఈ సినిమాలో మొదటగా కాలీవుడ్ హీరో గా పేరు పొందిన శింబు మొదటగా హీరోగా నటించారు.ఇందుకు సంబంధించి మొదటగా రంగం సినిమాలో చూపించే బాంబు దాడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హీరో శింబూ తో పాటు హీరోయిన్ కార్తిక లపై ఫోటోషూట్స్ కూడా నిర్వహించారు.

 Hero Shimbu To Act As Hero In Rangam Movie Instead Of Hero Jeeva-TeluguStop.com

ఇది ఇలా ఉండగా.మరికొన్ని రోజుల్లో పూర్తి సినిమా షూట్ సెట్స్ పైకి వెళ్తున్న నేపథ్యంలో అనుకోని కారణాలవల్ల హీరో శింబూ సినిమా నుండి బయటికి వెళ్లిపోయాడు.

ఈ సమయంలోనే దర్శకుడు ఆనంద్ శింబూ చేయాల్సిన హీరో పాత్రలో హీరో జీవా ని తీసుకువచ్చి ప్రధాన పాత్రలో నటింపచేశాడు.అయితే సినిమా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు గడిచిన తర్వాత తాజాగా ముందుగా అనుకున్న హీరో శింబూ, హీరోయిన్ కార్తీక లకు సంబంధించిన ఫోటో షూట్ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

 Hero Shimbu To Act As Hero In Rangam Movie Instead Of Hero Jeeva-రంగం’ చిత్రంలో హీరో జీవా కంటే ముందు ఏ హీరో నటించాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ సినిమా నుండి శింబూ తప్పుకోవడానికి అప్పట్లో చాలా కారణాలే తెరపైకి వచ్చాయి.

హీరో శింబు దర్శకుడితో ఓ విషయంలో వివాదాలు రావడం వల్లే ఆయన ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారని అనుకున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.

హీరో శింబూ సరసన హీరోయిన్ కార్తీక సరైన జోడీ కాదని హీరో భావించడంతో, ఆమె స్థానంలో తమన్నా కథానాయకుడిగా ఉంచమని చిత్ర బృందానికి హీరో శింబు సూచించారట.

Telugu Director Kv Anand, Jevva, Karthika, Rangam Movie, Shimbu, Shimbu And Karthika Viral Photos, Shooting, Social Media, Tamanna Bhatia, Viral, Viral Photos-Latest News - Telugu

అయితే హీరోయిన్ తమన్నా కు భారీగా పారితోషికం ఇవ్వాలని తమ దగ్గర అంత భారీ బడ్జెట్ లేదని నిర్మాతలు తేల్చి చెప్పడం వల్ల చేసేదేం లేక హీరో సినిమా నుండి బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.ఈ కారణం వల్ల మొత్తానికి హీరో శింబూ సూపర్ హిట్ అయిన రంగం సినిమా నుండి తప్పుకున్నారు.దీంతో రంగం సినిమాలో హీరోగా నటించిన జీవా కి మంచి అవకాశం లభించింది.

ఆ తర్వాత జీవా అనేక సినిమాలలో హీరోగా తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.

#Jevva #Social Media #Karthika #Viral #ShimbuAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు