ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలు అందరిలో తనకు ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు శర్వానంద్.ఇక ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి తన పెర్ఫార్మెన్స్తో ఎప్పుడూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు.
కేవలం పర్ఫామెన్స్ తోనే కాదు కథల ఎంపికలో కూడా తాను భిన్నమైన హీరో అని చెప్పకనే చెబుతుంటాడు.ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా దగ్గరయ్యాడు శర్వానంద్.
అమ్మ చెప్పింది, గమ్యం, శతమానంభవతి, ప్రస్థానం లాంటి సినిమాలతో తన నటనతో ఆకట్టుకుని మంచి విజయాలు ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్ ఐదేళ్ల నుంచి హిట్ అనే పదానికి మైళ్ల దూరం వెళ్లిపోయాడు.ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుకున్నంత స్థాయిలో హిట్ మాత్రం సాధించలేకపోతున్నాడు.ఇక ఈ రోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా మిక్స్ డ్ టాక్ తో ముందుకు వెళ్తుంది.
ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.చివరిసారిగా 2017లో శతమానంభవతి రాధా మహానుభావుడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి.మంచి విజయాలను అందుకున్నాడు శర్వానంద్.
అప్పటి నుంచి ప్రతి ఏడాది సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కానీ ఎందుకో ప్రేక్షకులను మాత్రం శర్వానంద్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి.2018 లో పడి పడి లేచే మనసు, 2019 రణరంగం , 2020లో జాను, 2021లో శ్రీకారం, మహాసముద్రం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా హిట్ టాక్ మాత్రం పని చేసుకోలేక పోయాయ్.ఈ క్రమంలోనే ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో మళ్లీ నిరాశ తప్పదు ఏమో అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి.
ప్రస్తుతం థియేటర్లో భీమ్లా నాయక్ సునామి నడుస్తుంది.ఇక ఈ నెల 11వ తేదీన రాధేశ్యామ్ విడుదల కానుంది.
ఇలాంటి భారీ చిత్రాల నడుమ శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఎక్కువ కాలం థియేటర్ లో ఉండటం కష్టమే.దీంతో ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది.
ఇక చివరికి శర్వానంద్ ఆశలన్నీ ఒకే ఒక జీవితం సినిమాపైనే ఉన్నాయి.