మరో సినిమాను మోసం చేసిన తెలుగు ప్రేక్షకులు 

ఔను కొన్ని సార్లు ప్రేక్షకులు సినిమను మోసం చేస్తూ ఉంటారు.యావరేజ్ టాక్ చెప్పి భారీ ఎత్తున వసూళ్లు ఇచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి.

 Hero Sharvanand Sreekaram Movie Collections-TeluguStop.com

ప్లాప్‌ టాక్ ఇచ్చిన సినిమా లను కమర్షియల్ హిట్‌ చేసిన ప్రేక్షకులు తెలుగు వారు అనడంలో సందేహం లేదు.గతంలో చాలా సినిమాలు కూడా ప్లాప్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ సాధించాయి.

అలాగే హిట్ టాక్ ను దక్కించుకుని వావ్ ఏముందిరా సినిమా అంటూ టాక్ ను దక్కించుకున్న సినిమాలు బ్రేక్ ఈవెన్‌ సాధించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల్ల పడ్డ సందర్బాలు కొన్ని ఉన్నాయి.తాజాగా విడుదల అయిన శ్రీకారం సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది.

శ్రీకారం సినిమా కు చాలా పాజిటివ్‌ టాక్ వచ్చింది.ఇలాంటి సినిమా యువతకు ఆదర్శం అని అందరు చూడాలని కామెంట్స్ వచ్చాయి.

కాని కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి.

శ్రీకారం సినిమా లో శర్వానంద్ హీరోగా నటించాడు.

ఆ సినిమా లో హీరో వ్యవసాయం చేయడంతో పాటు యువతకు మెసేజ్ ఇచ్చాడు.రైతులు ఈ సమయంలో వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయాన్ని కూడ చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.

సినిమా కు చిరంజీవి.కేటీఆర్‌ వంటి పెద్ద వారు ప్రమోషన్‌ చేయడం వల్ల పబ్లిసిటీ బాగానే దక్కింది.

పబ్లిసిటీకి తగ్గట్లుగానే సినిమా మొదటి రోజు రివ్యూవర్స్ పాజిటివ్‌ రివ్యూలు ఇచ్చారు.అలాగే సినిమా కు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గా రియాక్ట్‌ అయ్యారు.

అంతటి పాజిటివ్ టాక్‌ రావడంతో మొదటి మూడు రోజుల్లో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని అనుకున్నారు.కాని అనూహ్యంగా రెండవ రోజే కలెక్షన్స్ తగ్గాయి.

వీకెండ్స్ లో అయినా సినిమా ఆకట్టుకుంటుందా అంటే అది కూడా లేకుండా పోయింది.మొత్తంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.

ప్రేక్షకులు పాజిటివ్ టాక్‌ ఇచ్చారు కాని కలెక్షన్స్ ఇవ్వకుండా చిత్ర యూనిట్‌ సభ్యులను మోసం చేశారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ ప్రేక్షకులను పూర్తిగా తప్పుబట్టడానికి లేదు.

ఈ సమయంలో మెసేజ్‌ ల కంటే కూడా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ప్రేక్షకులు కోరుకుంటున్నారని వెళ్లడయ్యింది.

Telugu Break, Fansbetrayed, Sharvanand, Sreekaram, Telugu-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube